సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలని ప్రతిపక్ష నాయకులు టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటారు. ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఎమ్మెల్యేపై ఆరోపణలు కూడా సహజమే. అయితే ఏపీలోని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేయడం కాస్త వింతగానే ఉంది. మామూలుగానే టి‌డి‌పి నేతలు, వైసీపీ ఎమ్మెల్యేల టార్గెట్‌గా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇసుక, ఇళ్ల స్థలాలు, అక్రమ మైనింగ్, అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

అయితే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దందాలు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. ఉదయగిరి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటిపై ఆరోపణలు ఎక్కువగానే వస్తున్నాయి. నియోజకవర్గంలో దందాలు జరుగుతున్నాయని, ఇళ్ల స్థలాల్లో కోట్లు నోక్కేశారని ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే మేకపాటి... జెడ్పీటీసీ టికెట్లు, ఎంపీపీ పదవులు రేటు కట్టి మరీ అమ్మేశారని వైసీపీ నేత చేజర్ల సుబ్బారెడ్డి ఆరోపించారు.

జెడ్పీటీసీ టికెట్టు కోసం రూ.50 లక్షల మూట అప్పజెప్పామని, పార్టీ పదవులు కూడా అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి పనికి ఒక రేటు కడుతున్నారని, ఆయన చుట్టూ కొందరు దళారులని ఏర్పాటు చేసుకుని దందాలు చేస్తున్నారని అంటున్నారు. అంటే సొంత పార్టీ నేతే ఈ తరహాలో ఆరోపణలు చేశారంటే...ఉదయగిరిలో ఏ రకమైన పరిస్తితి ఉందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే మేకపాటి పనితీరుపై ఉదయగిరి ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. నెక్స్ట్ మేకపాటి వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. ఇప్పటికే నాలుగుసార్లు గెలిపించిన పెద్దగా ప్రయోజనం లేదని అనుకుంటున్నారు. ఇక ఇలాంటి పరిస్తితుల్లో నెక్స్ట్ టి‌డి‌పికి మంచి ఛాన్స్ దొరికినట్లే . టి‌డి‌పి నేత బొల్లినేని వెంకట రామరావు కాస్త యాక్టివ్‌గా పనిచేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే, నెక్స్ట్ ఉదయగిరిలో గెలిచే ఛాన్స్ ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: