ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతుంది అనే విషయం తెలిసిందే ఇప్పటికే అధికార టీఆర్ఎస్. అన్ని పార్టీ కీలక నేతలు అందరూ హుజురాబాద్ చేరుకొని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనివాస్ కు మద్దతుగా భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అదే సమయంలో అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచార రంగంలో దూసుకుపోతోంది. ఇంకోవైపు ఈటెల రాజేందర్ ఇక తనదైన వ్యూహాలతో దూసుకుపోతూ అని పార్టీలకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.  ఇలా ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం హుజురాబాద్ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ఓ వైపు ప్రచారం మరోవైపు విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరుగుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడు ప్రతిపక్షాలను విమర్శించడంలో ఎంతో వ్యూహాత్మకంగానే ఉంటారు. ఏది పడితే అది మాట్లాడకుండా కేవలం కొన్ని అసలుసిసలైన పాయింట్లు పట్టుకుంటూ ప్రతిపక్షాల పై విమర్శలు చేస్తూ ఉంటారు కేటీఆర్ .  ఇక ఇటీవల ఈటెల రాజేందర్ పై మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మాట్లాడారు  మంత్రి కేటీఆర్.



 కాంగ్రెస్లో భట్టి విక్రమార్క ఒక మంచి వ్యక్తి అంటూ కేటీఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ ఆ పార్టీలో భట్టి విక్రమార్క మాట వినలేదని గట్టి అక్రమార్కుల అదే నడుస్తుంది. అంటూ కేటీఆర్ పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది ఇక అదే సమయంలో ఈటెల గురించి స్పందించిన కేటీఆర్ నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ లో పెద్ద లీడర్ గా కొనసాగుతున్న జానారెడ్డిని ఓడించాము.. ఇక ఈటల రాజేందర్ ఎంత అంటూ ప్రశ్నించారు. తాను రాజీనామా చేయడం వల్ల దళిత బంధు వచ్చింది అని ఈటెల రాజేందర్ చెప్పుకుంటున్నాడు. రాజీనామా చేయడం వల్ల కాదు అతను పదవిలో ఉన్నప్పుడే దళిత బంధు వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: