ఏపీ మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న సొంత జిల్లా లో కూడా పార్టీని నిల‌బెట్టు కోలేని దుస్థితికి వ‌చ్చేశారు. అస‌లు గ‌త ఎన్నిక‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చిత్తు చిత్తు గా ఓడిపోయింది. ఇది ఒక ఎదురు దెబ్బ అనుకుంటే మ‌రో వైపు ఆయ‌న సొంత జిల్లాలో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింది. కుప్పంలో ఆయ‌న మాత్ర‌మే విజ‌యం సాధించారు. ఇక చిత్తూరు జిల్లాలో ఉన్న మూడు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాలు ( రాజంపేట కూడా స‌గం ఉంది ) వైసీపీ బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించింది. కుప్పంలో కూడా చంద్ర‌బాబు తొలి రౌండ్ల‌లో బాగా వెన‌క ప‌డ్డారు. ఎట్ట‌కేల‌కు చివ‌ర్లో పుంజుకుని విజ‌యం సాధించారు.

ఇక ఆ త‌ర్వాత మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డితో పాటు వైసీపీ అధిష్టానం కుప్పం నియోజ‌క‌వ‌ర్గా న్ని సైతం గ‌ట్టిగానే టార్గెట్ చేశారు. కుప్పం లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల‌లో అయితే అస‌లు ఆ పార్టీ నుంచి నామినేష‌న్లు వేసుందుకు కూడా చాలా చోట్ల దిక్కు లేని పరిస్థితి. ఇక ఎంపీ టీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల లోనూ అదే ప‌రిస్థితి పున‌రావృతం అయ్యింది.

ఇక ఆయ‌న సొంత జిల్లాలో ఆయ‌న స్వ‌గ్రామం నారా వారిప‌ల్లె లో సైతం ఎంపీటీసీ ని వైసీపీ బంప‌ర్ మెజార్టీ తో గెలుచు కుంది. అయితే ఇప్పుడు ఆ జిల్లాలో గంగాధర నెల్లూరు, మదనపల్లి, స‌త్య‌వేడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన కీల‌క నేత‌లు పార్టీకి రాజీనామాలు చేయడానికి రెడీ అయ్యారు. జిల్లాలో ఐదారు నియోజ‌క‌వ‌ర్గాల లో ఇన్ చార్జ్‌లు ఎప్పుడు పార్టీని వీడి బ‌య‌ట‌కు వెళ్లి పోతారో తెలియ‌డం లేదు. చంద్ర‌బాబు ఈ ప‌రిస్థితి ని కంట్రోల్ చేయ లేక‌పోతే పార్టీ కి 2024 ఎన్నిక‌ల‌లో ఇక్క‌డ పోటీ చేసేందుకు కూడా స‌రైన నాయ‌కులు లేని ప‌రిస్థితి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: