ఇది విన‌డానికి కాస్త విచిత్రం గానే ఉండ‌వ‌చ్చు. అయితే ఇది నిజం అన్న సందేహాలు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇంకా చెప్పాలంటే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఆయ‌న ఎవ‌రో కాదు ఒక‌ప్పుడు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విధేయుడిగా ఉన్న ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 2014 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఆయ‌న వైఎస్ ఫ్యామిలీకి విధేయుడిగా ఉండే వారు. ఆ ఎన్నిక‌ల‌లో తెలంగాణ లో వైసీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ గా రికార్డుల‌కు ఎక్కారు. ఆ త‌ర్వాత ఆయ‌న టీఆర్ ఎస్ లోకి జంప్ చేసేశా రు. ఇక 2018 ముంద‌స్తు సాధార‌ణ ఎన్నిక‌ల‌లో ఖ‌మ్మం జిల్లాలో కారు టైర‌కు పంక్చ‌ర్లు ప‌డ్డాయి. మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావుతో పాటు ప‌లువురు కీల‌క నేత‌లు ఓడిపోయారు.

ఆ త‌ర్వాత అదే సాకు చూపి కేసీఆర్ పొంగులేటికి 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల లో టిక్కెట్ ఇవ్వ‌లేదు స‌రిక‌దా ? అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న నామా నాగేశ్వ‌ర రావును పార్టీలోకి ఆహ్వానించి ఎంపీ సీటు ఇచ్చారు. దీంతో నామా భారీ మెజార్టీ తో ఖ‌మ్మం ఎంపీగా గెలిచారు. ఇక ఆ త‌ర్వాత పొంగులేటి కి రాజ్య‌స‌భ వ‌స్తుంద‌న్న ప్ర‌చారం జ‌రిగినా కేసీఆర్ మాత్రం ఎప్ప‌టి క‌ప్పుడు ప‌క్క‌న పెడుతూ వ‌స్తున్నారు. దీంతో ర‌గిలి పోతోన్న ఆయ‌న ఇప్పుడు ష‌ర్మిల పార్టీ లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు గ‌త కొంత కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే ముందు కొద్ది రోజులు పాటు ష‌ర్మిల పార్టీకి తెర వెన‌క వ్యూహాలు ప‌న్నుతూ.. కాస్త పార్టీకి మూమెంట్ వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న పార్టీ కండువా క‌ప్పుకుంటార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ష‌ర్మిల పాద‌యాత్ర కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సన్నిహితులతో ఏర్పాట్లు చేయిస్తున్నాడు అని గుస గుస‌లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: