ఎస్ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌స్తోంది. గ‌త కొంత కాలంగా టీఆర్ ఎస్ లో ఎలాంటి ప్రాధాన్య‌త లేకుండా ఉన్న మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు పార్టీ మారిపోతున్నార‌న్న వార్త వ‌స్తోంది. ఆయ‌న బీజేపీలోకి వెళుతున్నార‌ని. .బీజేపీ నుంచి ఆయ‌న‌కు భారీ ఆఫ‌ర్ ఉంద‌ని అంటున్నారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌లో మంత్రి గా ఉండి కూడా తుమ్మ‌ల పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న పై కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాళ ఉపేంద‌ర్ రెడ్డి గులాబీ గూటికి చేరిపోయారు. త‌ర్వాత తుమ్మ‌ల‌కు అ టు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా.. ఇటు క‌నీసం జిల్లాలోనూ.. నియోజ‌క వ‌ర్గ స్థాయిలోనూ ప‌ట్టు లేకుండా పోయింది.

దీంతో తుమ్మ‌ల బీజేపీలోకి వెళుతున్నార‌ని.. బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం సూచ‌న ల మేరకు ఆ పార్టీ రాష్ట్ర నేత‌లు తుమ్మ‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే తుమ్మ‌ల క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. ప్ర‌స్తుతం తెలంగాణ లో ఈ సామాజి క వ‌ర్గం కూడా కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. అందుకే ఈ సామాజిక వ‌ర్గం లో ఐకా న్ గా ఉన్న తుమ్మ‌ల ను త‌మ వైపున కు తిప్పు కుంటే క‌మ్మ వ‌ర్గంలో మెజార్టీ నేత‌లు బీజేపీలోకి వ‌స్తార‌ని ఆ పార్టీ నేత‌లు ప్లాన్ చేస్తున్నారు.

అందుకే అదే వ‌ర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి కూడా కొంత లాబీయింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తుమ్మ‌ల‌ను పార్టీలోకి లాగేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. ఆయ‌న సుజ‌నా చౌద‌రి ని కూడా తుమ్మ‌ల‌తో మాట్లాడాల‌ని పుర‌మాయిస్తున్న‌ట్టు టాక్ ? మ‌రి తుమ్మ‌ల కారు దిగుతారా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: