ఆయ‌న ఎంపీటీసీ గా పోటీ చేసి ఓడిపోయారు. అయితే జ‌గ‌న్ ఆయ‌న‌కు ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. ఆ త‌ర్వాత వైసీపీ జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వి కూడా క‌ట్ట‌బెట్టారు. అలాంటి నేత వైసీపీ కి షాక్ ఇస్తూ టీడీపీ లో చేరిపోయారు. టీడీపీలో చంద్ర‌బాబు ప్రాప‌కంతో నియోజ‌క‌వ‌ర్గానికి భారీగా నిధులు ద‌క్కించు కుని ఓ వెలుగు వెలిగారు. గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ నుంచి పోటీ చేసి ఏకంగా 81 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఆ నేత ఎవ‌రో కాదు ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు మాజీ ఎమ్మెల్యే ముత్త‌ముల అశోక్ రెడ్డి.

గ‌త ఎన్నిక‌లలో 81 వేల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయాక ఆయ‌న తిరిగి వైసీపీ లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు అయితే చేశారు. అయితే జగన్ అంగీకరించలేదు. దీంతో ఆయన టీడీపీలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నార‌నే తెలుస్తోంది. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. అలాంటి వారిలో అశోక్ రెడ్డి కూడా ఒక‌రు. అందుకే ఆ గ్యాంగ్ ను తిరిగి పార్టీ లోకి చేర్చుకునేందుకు జ‌గ‌న్ ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న టాక్ ఉంది.

దీంతో అశోక్ రెడ్డికి వైసీపీ గేట్లు మూసుకు పోవ‌డంతో ఇప్పుడు టీడీపీ లోనే కాస్త యాక్టివ్ అయ్యారు. జ‌న‌సేన + టీడీపీ పొత్తు ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌లో తాను తిరిగి టీడీపీ త‌ర‌పునే గిద్ద‌లూరు లో పోటీ చేస్తాన‌ని సన్నిహితుల తో చెపుతున్న‌ట్టు తెలుస్తోంది. గిద్దలూరు నియోజకవర్గం 2009లో ప్రజా రాజ్యం పార్టీ నుంచి అన్నా రాంబాబు గెలిచారు. దీంతో ముత్తముల అశోక్ రెడ్డి తన సామాజికవర్గం ఓట్లతో పాటు జ‌న‌సేన ఓటు బ్యాంకు కూడా క‌లుపు కుంటే తాను సులువుగా ఇక్క‌డ గెలుస్తా ను అని లెక్క లు వేసుకుంటున్నార‌ట‌. అందుకే ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంపై గ్రిప్ కోసం మ‌రింత గా క‌ష్ట‌ప‌డుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: