ఏపీలో గంజాయి వ్యవహారానికి సంబంధించి మాజీమంత్రి నక్కా ఆనందబాబు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు నర్సీపట్నం పోలీసులు. ఈ సందర్భంగా నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ గంజాయి స్మగ్లింగ్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై మాట్లాడానని తెలిపార్. రాత్రి విశాఖ ఏజెన్సీ నుండి పోలీసులు మా ఇంటికి వచ్చారు అని ప్రజా స్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం లేదా అంటూ నిలదీశారు. మీడియాలో మాట్లాడిన అంశాలపై ఆధారాలివ్వండి అని అడిగారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

డ్రగ్స్ పై ఎవరూ మాట్లాడవద్దని డిజిపియే చెప్పారని ఆయన ప్రస్తావించారు. 8000 కోట్ల రూపాయల గంజాయి రాష్ట్రంలో పండిస్తున్నారు అని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ 25000 కోట్లు ఉంటుంది అన్నారు ఆయన. ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ను నీరు గారుస్తున్నారు అని విమర్శించారు. మా గొంతు నొక్కాలని చూస్తున్నారు అని ఆరోపించారు. మా కార్యకర్తలను బెదిరించటానికే నాకు నోటీసులు అని ఆయన పేర్కొన్నారు. తలా తోకా లేని ప్రశ్నావళి తయారు చేసుకొని వచ్చి సమాధానం చెప్పమని అడిగారు అన్నారు.

ఆధారాలున్నాయా అని అడిగారు అని వివిధ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ చూపించాను అన్నారు. మీరు రాజీనామా చేసి అధికారం మాకు అప్పగిస్తే మీము గంజాయి స్మగ్లింగ్ అరికడతాం అని స్పష్టం చేసారు. స్టేట్ మెంట్ రికార్డ్ చేసుకున్నారు అని తెలిపారు. కాగా మాజీ హోం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ... నిన్న మధ్యాహ్నం మాదకద్రవ్యాలపై ఆనందబాబు మీడియా సమావేశంలో మాట్లాడితే అర్థరాత్రి పోలీసులు ఆనందబాబు ఇంటికి రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు నర్సీపట్నం నుంచి గుంటూరు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు చినరాజప్ప. అన్నింట్లో ఇంత మెరుపువేగంగా పోలీసులు స్పందిస్తే బాగుండునన్నారు ఆయన. పక్కనున్న ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతుంటే.. అక్కడికి వెళ్లే తీరికలేని పోలీసులు ఇక్కడికి వచ్చారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp