రాష్ట్రంలో పెన్షన్ లు సరిగా అందక వృద్ధులు గుండె ఆగి చనిపోతున్నారు అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఆంధ్రుల కలల రాజధాని కేసు కోర్టులో పెండింగులో ఉందిఅని అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రోడ్లు వెయ్యాలన్న, కోర్టు భవనాలు కట్టాలన్నా కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల నిర్మాణం సాధ్యంకాదు అని ఆయన తెలిపారు. విద్యుత్ కోతలతో కొత్త పరిశ్రమలు రాలేని పరిస్థితి ఉంది అని వెల్లడించారు.

విశాఖపట్నం కు పట్టిన గ్రహణం వీడిపోవాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే విశాఖ ప్రజలు అర్ధం చేసుకుంటారు అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి , సకలశాఖ మంత్రి, ఇతర కేబినెట్ మంత్రులు అర్ధం చేసుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించి, కోర్టులో వేసిన కేసులు ఉపసంహరించుకోవాలి అని సూచించారు. రాజధాని నిర్మాణంకోసం భూములు తీసుకుని, ఇప్పుడు వదిలేసి వెళతామంటే ప్రజలు ఊరుకోరు అని ఆయన పేర్కొన్నారు.

సీఎం గణపతి సచ్ఛిధానద స్వామి ని కలవడం ఆశ్చర్యకరమైన పరిణామం. కేవలం విశాఖ శారద పీఠాధిపతిని కలవడమే కాకుండా ఇతర స్వామిని కలవడం సంతోషం అని వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న పలు పరిణామాలు గణపతి సచ్ఛిదానంద స్వామికి తెలియకపోవచ్చు అన్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కి ప్రస్తుత ముఖ్యమంత్రి ఏం చేసారు?  అని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని యాదాద్రీని ఏరకంగా అభివృద్ధి చేస్తున్నారో చూసి నేర్చుకోవాలి అని హితవు పలికారు. స్వామీజీ ప్రకటన తర్వాత అయిన ముఖ్యమంత్రి నిజమైన హిందూ అభివృద్ధి చేయాలి అని కోరారు.  స్వామీజీ ప్రకటన ఆంతర్యాన్ని ముఖ్యమంత్రి గమనించాలి. మా పార్టీలో ఒక ఏకచిత్రనటుడు ఉన్నాడు అంటూ ఆయన తన నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటాడు అని ఎద్దేవా చేసారు. మా పార్టీ రాజ్యసభ రెడ్డికి, లోక్ సభ రెడ్డికి ఇటీవల సీఎం దర్శనం అరుదుగా దొరుకుతుందని తెలిసింది అన్నారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు.

మరింత సమాచారం తెలుసుకోండి: