ఎస్ ఇప్పుడు క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల‌లో ఇదే మాట వినిపిస్తోంది. దివంగ‌త మాజీ ఎంపీ , నంది పైపుల అధినేత ఎస్పీ వై రెడ్డి కుటుంబం అంతా ఇప్పుడు వైసీపీ లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి క‌ర్నూ లు జిల్లా లో నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం తో పాటు నంద్యాల పార్ల‌మెంటు ప‌రిధిలో రాజ‌కీయాల‌ను ఎస్పీ వై రెడ్డి శాసించారు. వివాద ర‌హిత రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉండే ఆయ‌న‌కు మంచి పేరు ఉంది.

గ‌తంలో క‌ర్నూలు జిల్లా లోని నంద్యాల ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన ఆయ‌న్ను వైఎస్ 2004 లో నంద్యాల ఎంపీ గా పోటీ చేయించారు. ఆ ఎన్నిక‌ల్లో బంప‌ర్ మెజార్టీ తో గెలిచిన ఆయ‌న 2009 ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి నంద్యాల నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎంపీ గా విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు అనూహ్యంగా వైసీ పీ లోకి వ‌చ్చిన ఆయ‌న మూడో సారి ల‌క్ష ఓట్ల మెజార్టీతో నంద్యాల ఎంపీ గా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

ఆ త‌ర్వాత కొద్ది రోజు ల‌కే ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఆయ‌న టీడీపీ లో చేరిన కొద్ది రోజుల‌కే అనారోగ్యం పాల‌య్యారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో సీటు తన అల్లుడికి టిక్కెట్ ఇవ్వాలని బాబు ద‌గ్గ‌ర పట్టుబట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన జనసేనలో చేరి ఎంపీ గా పోటీ చేశారు. ఇంకా చెప్పాలంటే ఆయ‌న అల్లు డు తో పాటు ఆయ‌న ఇద్ద‌రు కుమార్తెలు కూడా జ‌నసేన నుంచే ఎమ్మెల్యే లుగా పోటీ చేశారు.

ఇక ఆయ‌న మ‌ర‌ణాంత‌రం ఇప్పుడు ఆయ‌న కుటుంబం అంతా వైసీపీ లోకి వెళ్లి తిరిగి రాజ‌కీయంగా అదృష్టాన్ని ప‌రీక్షించు కోవాల‌ని చూస్తున్నార‌ట‌. జ‌గ‌న్ కూడా ఎస్పీ వై రెడ్డి కుటుంబం విష‌యంలో సానుకూలంగానే ఉన్నార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: