క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి కుటుంబానికి ఎంత మంచి పేరు ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న త‌ర్వాత ఆయ‌న వార‌సుడి గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కోట్ల సూర్య ప్ర‌కాష్ రెడ్డి సైతం క‌ర్నూలు నుంచి ఎంపీగా విజ‌యం సాధించి కేంద్ర స‌హాయ మంత్రి గా కూడా ప‌నిచేశారు. ఇక సూర్య ప్ర‌కాష్ రెడ్డి భార్య సుజాత‌మ్మ సైతం డోన్ నుంచి 2004లో ఎమ్మెల్యే గా గెలిచారు. ఆ త‌ర్వాత 2009 ఎన్నిక‌ల‌లో మాత్రం ఆమె ఓడిపోయారు. క‌ట్ చేస్తే 2014లోనూ కాంగ్రెస్ నుంచే పోటీ చేసిన కోట్ల ఫ్యామిలీ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మాత్రం టీడీపీలో చేరింది.

క‌ర్నూలు ఎంపీ గా పోటీ చేసిన కోట్ల సూర్య ప్ర‌కాష్ రెడ్డి ఓడిపోయారు. ఇక ఆలూరు నుంచి ఎమ్మె ల్యేగా పోటీ చేసిన సుజాత‌మ్మ కూ డా ఓడిపోయారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల లో కూడా ఈ భార్య‌, భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఒక‌రు ఎంపీ గా, మ‌రొక‌రు ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని అనుకుంటున్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం కోట్ల ఫ్యామిలీ కి షాక్ ఇస్తార‌ని జిల్లాలో చ‌ర్చ జ‌రుగుతోంది. క‌ర్నూలు పార్ల‌మెంటు స్థానాన్ని బీసీల‌కు ఇవ్వాల‌ని బాబు డిసైడ్ అయ్యార‌ట‌.

ఇక కోట్ల ఫ్యామిలీకి కేవ‌లం డోన్ సీటు మాత్ర‌మే ఇస్తార‌ని అంటున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబును క‌లిసి న సుజాత‌మ్మ ఆలూరులో కేఈ ప్ర‌భాక‌ర్ జోక్యం పై ఫిర్యాదు చేయ‌గా.. మీరు 2004లో డోన్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచార‌ని.. అక్క‌డ నుంచే పోటీ చేయాల‌ని సూచించిన‌ట్టు తెలిసింది. డోన్ లో రెండు సార్లు కేఈ ఫ్యామిలీకే చెందిన కేఈ ప్ర‌తాప్ పోటీ చేసి ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ చేతిలో ఓడిపోయారు. అందుకే ఈ సారి డోన్ ను వ‌దుల‌కుని ఆలూరు పై కేఈ ఫ్యామిలీ క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక బాబు కోట్ల ఫ్యామిలీకి డోన్ సీటు తో స‌రి పెట్టేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: