దేశ వ్యాప్తంగానే ఒకప్పుడు ఉప ఎన్నికలు అంటే పెద్ద ఆసక్తి ఉండేది కాద‌నే చెప్పాలి. ఎందుకంటే అక్క‌డ ఎవ‌రో ఒక‌రు చ‌నిపోతే అదే కుటుంబానికి చెందిన వ్య‌క్తిని నిల‌బెట్టే వారు. ప్ర‌ధాన పార్టీలు కూడా అక్క‌డ పోటీ చేసేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూపేవే కాదు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి గా ఉండ‌గా ఓ వ్య‌క్తి సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉండి చ‌నిపోతే.. అప్పుడు అదే వ్య‌క్తి కుటుంబానికి చెందిన వారిని ఉప ఎన్నిక ల‌లో పోటీకి పెడితే అక్క‌డ టీడీపీ పోటీ చేయ‌కూడ‌ద‌న్న సంప్ర‌దాయం క్రియేట్ చేశారు. అయితే బాబు ఇప్పుడు ఏపీ లో క‌డ‌ప జిల్లాలో జ‌రుగుతోన్న నంద్యాల ఉప ఎన్నిక‌కు కూడా అదే ప‌ద్ధ‌తి పాటిస్తున్నారు.

అయితే రాను రాను ఈ సంప్ర‌దాయానికి తెలంగాణ లో కేసీఆర్ తూట్లు పొడిచి ప‌డేశారు. అద‌లా ఉంటే నిన్న‌టి వ‌ర‌కు కేసీఆర్ రైట్ హ్యాంట్ గాను, ఆయ‌న కేబినెట్లో మంత్రి గాను ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌ను ఆయ‌న బ‌ర్త‌ర‌ప్ చేశారు. ఇక ఈట‌ల టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఇప్పుడు బీజేపీలో చేరారు. ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గా నికి ఉ ప ఎన్నిక జ‌రుగుతోంది.

అయితే ఈ ఉప ఎన్నిక అటు ఈట‌ల తో పాటు ఇటు కేసీఆర్‌కు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఇక కేసీఆర్ ఇక్క‌డ ఎలాగైనా కారు పార్టీని గెలిపించి.. ఈట‌ల‌కు ప‌ట్టు లేద‌ని ఫ్రూవ్ చేసేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఇక్క‌డ గెలిచేందుకు ఓటర్లకు భారీ ఎత్తున తాయిలాలు అందించేందుకు ఎవరూ వెనుకాడటం లేదు. హుజూరాబాద్ లో ఒక్కో ఓటుకు రూ.10 నుంచి రూ.15 వేలు కూడా ఇచ్చేందుకు రెండు ప్ర‌ధాన పార్టీలు వెను కాడ‌డం లేద‌ట‌. ఇక మ‌రో ప్ర‌ధాన పార్టీ అయితే ఒక కుటుంబంలో 10 ఓట్లు ఉంటే రు. 3 ల‌క్ష‌లు ఇచ్చేందుకు కూడా వెను కాడ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ లెక్క‌న చూస్తే ఈ ఉప ఎన్నిక ఎంత ఖ‌రీదైందో అంచ‌నా వేసుకోవ‌చ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: