ప్రస్తుతం ప్రపంచంలో భారత్-చైనా సంబందించిన బలాబలాల మీద బాగా చర్చలు జరుగుతున్నాయి. అంటే భారత్ కంటే మూడొంతులు ఎక్కువ సైనిక, ఆయుధ బలగం ఉన్న చైనాను యుద్ధం వస్తే భారత్ నిలువరించగలదా అనే దానిమీద అంతర్జాతీయంగా తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ మీడియా కూడా ఇందులో పాల్గొంటున్నాయి కూడా. అయితే ఇక్కడ భారత్ దేశ చరిత్ర ఒక్కసారి పరికిస్తే, పదకొండు లక్షల సైన్యం ఉన్న కౌరవులను ఏడు లక్షల సైన్యం మాత్రమే ఉన్న పాండవులు ఓడించి పక్కన పారేసిన ఘటన గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. యుద్ధం అంటే కేవలం ఎన్నో రేట్ల ఆయుధాలో లేక ఎన్నో రేట్ల సైన్యంమో కాదు, వ్యూహాలు మాత్రమే. అంత బలమైనదే చైనా అయితే కేవలం 50 మంది భారత సైన్యం 380 పైగా ఉన్న చైనా సైన్యాన్ని నిలువరించారు, మొన్న జరిగిన గాల్వన్ లోయలోని ఘటనలో. ఇదొక్కటి చాలదా ఆ మీడియా కు భారత్ ఏంటనేది.

అయినా యుద్ధం వస్తే రెండుపక్కల ఎంతో కొంత నష్టం తప్పకుండ ఉంటుంది. రెండు దేశాలు ఎంతో కొంత నష్టపోవాల్సిందే. రెండు దేశాలు బాధను అనుభవించాల్సిందే. అందుకే తనరోజు వస్తే ఎవడైనా గెలుస్తాడు, అసలు యుద్దాలు వద్దు అనుకున్నదే నిజమైన శాంతిని ఆశించే దేశం. అలా అనుకుంటూ భారత్ ముందుకు పోతుంది తప్ప చేతకాకో, చేవలేకో కాదు అంటున్నారు నిపుణులు. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద పడి బ్రతికే దానికే అంత ఉంటె, తనమానాన తాను శాంతిని, ధర్మాన్ని నమ్ముకుని బ్రతికేస్తున్నా ఇంకా దానిపై పడి ఏడ్చే వాళ్ళు ఎన్ని దెబ్బలు కొడుతున్నా సహనంతో భరిస్తూనే ముందుకు పోతుంది. మరి అలాంటి భారత్ ను తక్కువ అంచనా వేసి అడుగు ముందుకు వేస్తె నష్టాన్నే చవిచూడాల్సి వస్తుంది.

పోనీ యుద్ధమే వస్తే, భారత్ ను అలాగే ప్రపంచం వదిలేసి ఊరుకుంటుందా, ఎవరు తోడురాకుండా ఉండగలరా..? స్నేహం అంటే వెన్నుపోటు అనే నీకే అంత ఆశగా యుద్ధభూమిలో మిత్రులు ఉంటె, నమ్మితే ప్రాణం ఇచ్చే భారత్ కి అండగా ఉండేవాళ్ళు ఎలాంటి ఉద్దేశ్యంతో దానికి  వస్తారో ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులలో కూడా నీకు కాబట్టి యుద్ధం అనే ఆలోచనలు వస్తున్నాయి, భారత్ కు వాక్సిన్ అందరికి అందుబాటులోకి తేవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి. ఒకదేశాన్ని నాశనం చేసి బాగుకోనే నీకు ఎంత బలం ఉండి ప్రయోజనం ఏంటి, పరుల బాగు కూడా కోరుకునే భారతీయులతో నీలాంటి తుచ్ఛమైన వాటితో పోల్చుకోవడం, దాని గురించి చర్చించుకుని ఆయా ప్రముఖ పత్రిక లు వాటి స్థాయిని దిగజార్చుకుంటున్నాయి అంతే.!

మరింత సమాచారం తెలుసుకోండి: