రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసిన తర్వాత తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. . మంత్రి హరీష్ రావు పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ప్రపంచం లోనే అత్యంత ఖరీదు అయిన ఎన్నికలు హుజూరాబాద్ ఎన్నికలు అని అన్నారు. ఒక పార్టీ 400 కోట్లు..మరో పార్టీ 100 కోట్లు ఖర్చు పెడుతుంది అని ఆయన ఆరోపణలు చేసారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు ప్రజా సమస్యలు మీద జరిగేవి కాదు అని వ్యాఖ్యలు చేసారు.

ప్రజా సమస్యలు అసలు చర్చ లేదు అని తోడు దొంగల మద్య మాత్రమే చర్చఅని ఆరోపించారు. ఉద్యోగ నియామకాలు రాష్ట్రం లో పెద్ద సమస్య అంటూ ఆయన విమర్శలు చేసారు. ఫీజు రీయంబర్స్ మెంట్ 4 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది అని నిరోష అనే నిరుద్యోగ యువతి ఉద్యోగాల పై నిలదీస్తే కొడతారా అంటూ ఆయన మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్తామని చెప్తే దాడి చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరోషా నీ అసభ్యకరమైన పదజాలం తో తిట్టారు అని విమర్శలు గుప్పించారు రేవంత్.
 
నిరోషా పై దాడి చేసి భయపెట్టారు అని ఆయన మండిపడ్డారు. హుజూరాబాద్ లో 36 వేళ మంది నిరుద్యోగులు...30 వేల మంది విద్యార్థులు ఉన్నారు అని అన్నారు. నిరుద్యోగులు ప్రశ్నించడం మొదలు పెడితే టీఆరెఎస్ ప్రచారం సాగదని భయం పట్టుకుంది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. హుజూరాబాద్ లో 100 ల కోట్లు వరదలై పారుతున్నాయి అని అన్నారు. చిత్ర విచిత్ర మైన పరిస్థితులు హుజూరాబాద్ ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. అక్రమంగా సంపాదించిన దొంగ సొమ్మును బయట పెడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. విద్యార్థి,నిరుద్యోగ ప్రతినిధిగా వెంకట్ నీ భరిలోకి దింపాం అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: