హుజురాబాద్ లో దళిత బంధు నిలుపుదలకు కేసీఆరే కారణం అని ఆరోపించారు తెలంగాణా బిజెపి నేత డీకే అరుణ. రెండు నెలల లోపు హుజురాబాద్ లో అందరికి దళిత బంధు ఇస్తా అని కేసీఆర్ మాట ఇచ్చారుఅని ఆమె వ్యాఖ్యలు చేసారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దళితబంధు బిజెపి ఆపిందని బిజెపిపై నిందలు వేస్తున్నారుఅని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉండే అర్హత కెసిఆర్ కు లేదు అని ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ రాజీనామా చేయాలిఅని డిమాండ్ చేసారు.

జీహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా వరదల్లో నష్టపోయిన వారికి 10 వేల రూపాయలు ఇస్తామన్నారు..ఇప్పటికి ఇవ్వలేదు అని వ్యాఖ్యలు చేసారు. ఆ 10 వేల నిధులు ఇవ్వొద్దని బండి సంజయ్ ఈసీకి లేఖ రాసినట్లుగా దొంగ లేఖ సృష్టించారు అని అన్న ఆమె... హుజురాబాద్ లో రెండు నెలలుగా దళిత బంధు అమలు చేయకుండా ఏం చేశారు అని ప్రశ్నించారు. హుజురాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని బిజెపి డిమాండ్ చేసింది అన్నారు ఆమె. ఒక నియోజకవర్గంలో ఎన్నికల కోసం తెచ్చిన అబద్దపు హామీ, మోసం తేట తెల్లమైంది అని పేర్కొన్నారు.

బిజెపి  దళిత బంధు ఆపింది అన్న అసత్య ప్రచారాలు టిఆర్ఎస్ ఆపాలి అని ఆమె కోరారు. దళితులకు ఆశ పెట్టి మోసం చేయాలనుకున్నారుఅని అన్నారు. కేసీఆర్ ప్రజలను మోసం చేయడం మానుకోవాలి అని వ్యాఖ్యలు చేసారు. యాదగిరి నరసింహ స్వామి మోసాలు చేయమని చెప్పాడా అని అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకోము అంటూ హెచ్చరించారు. దళిత బంధు ఆపమని బిజెపి లేఖ రాస్తే ఆ లేఖను బయట పెట్టాలి అని ఆమె సవాల్ చేసారు. దళితులనే కాదు బీదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి అమలు చేయాలని కోరుతున్నాం అని అన్నారు. ఎన్నికల కోసం పధకాలు కాదు..రాష్ట్రం కోసం పధకాలు ఉండాలి అన్నారు డీకే అరుణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp