తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో రాజకీయంగా తనకు ప్రత్యేక స్థానం కోసం షర్మిల తీవ్రంగా కష్టపడతా ఇప్పుడు పాదయాత్ర ద్వారా ప్రజల్లో మద్దతు కూడగట్టుకోవాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అలాగే భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెడుతూ ఆమె రాజకీయం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారని ప్రతి గ్రామం లోకి వెళ్లేందుకు ఆమె ఇప్పటికే ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశారు అని ప్రచారం మొదలైంది.

అయితే షర్మిలకు సొంత పార్టీ నాయకుల నుంచి పూర్తి స్థాయి లో సహకారం రావడం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒక సీనియర్ నాయకుడు కి ఆమె పాదయాత్ర బాధ్యతలు అప్పగిస్తే ఆయన కనీసం పట్టించుకోవడం లేదని జిల్లాలో ఉన్న నాయకులతో అలాగే వైయస్ రాజశేఖర్రెడ్డి అభిమానులతో కనీసం సమన్వయం చేసుకోవడం లేదని ఇటీవల కన్వీనర్ల పదవులు ఇస్తే కనీసం వాళ్ళతో కూడా మాట్లాడటం లేదని షర్మిల చాలా సీరియస్ గా ఉన్నారట. ఇంద్ర శోభన్ పార్టీ మారి పోవడానికి కూడా ఆయనే ప్రధాన కారణమనే ఆలోచనలో ఉన్నారట.

అలాగే పాదయాత్ర కు సంబంధించి కొన్ని కొన్ని విషయాల్లో ఆయనకు పూర్తి బాధ్యతలు అప్పగించిన సరే కనీసం నియోజకవర్గాల్లో ఎవరితో మాట్లాడకుండా అక్క పెత్తనం ఎక్కువగా చేస్తున్నారని అలాగే నిధుల దుర్వినియోగం కూడా ఎక్కువగా జరుగుతుందని షర్మిల గుర్తించారని అంటున్నారు. దీంతో ఇప్పుడు షర్మిల ఆయనపై ఆగ్రహంతో మరో నాయకుడికి పాదయాత్ర బాధ్యతలు అప్పగించారని విధంగా కొనసాగితే మాత్రం పార్టీ నుంచి పంపించడానికి తనకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవని షర్మిల సదరు నాయకుడి వద్ద ప్రస్తావించారు అనేది వైయస్సార్ టీపీ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts