రాజకీయాల్లో చాలా మంది సోషల్ మీడియా ను నమ్ముకొని ముందుకు వెళుతూ ఉంటారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది నాయకులు సోషల్ మీడియా ద్వారానే రాజకీయం చేసే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తుంటారు. అదే విధంగా తమ వ్యక్తిగత జీవితం అలాగే తాము చేసే కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో ఫోటోల రూపంలో అలాగే వీడియోల రూపంలో పోస్టుల రూపంలో పోస్ట్ చేస్తూ అభిమానులకు అందిస్తూ వుంటారు. అయితే ఇది కొంత మంది నాయకుల విషయంలో మాత్రం కాస్త ఇబ్బందికరంగా మారుతుంది అనే విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి.

ప్రధానంగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక కీలక ఎమ్మెల్యే విషయంలో దీనికి సంబంధించి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తున్నాయి. వ్యవసాయం విషయంలో అయినా ఎమ్మెల్యే గారు కాస్త ఉషారుగా ఉంటూ పని చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇటీవలి కాలంలో బాగా హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే గారి విషయంలో చాలా వరకు సీరియస్ గా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు సంబంధించి ఈ ఫోటో బయటకు వచ్చినా సరే దానిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ  విమర్శలు చేస్తూ ఉంటారు.

ఇక ఆయన ఫోటోలు చూసిన వైసీపీ కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే గారికి సోషల్ మీడియా పిచ్చి బాగా ఎక్కువైంది అని కాస్త చేసుకుంటే మంచిదని అలాగే ఈ ఫోటో పెడితే ఫోటో పెడితే బాగోదని అనవసరంగా కామెడీ పీస్ అయిపోతారు అంటూ కొంతమంది సూచిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే గారి విషయంలో వైసీపీ నాయకులు కూడా కాస్త ఎక్కువగానే నవ్వుకుంటున్నారని ఇటువంటి చర్యలు ఎంతమాత్రం మంచిదికాదని పదవిలో ఉన్నప్పుడు ఆయన కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని భవిష్యత్తులో ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకు వెళుతూ ఉంటాయి అని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: