క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర‌రెడ్డి లేని పోని చిక్కులు కొని తెచ్చుకుంటున్న ట్టే ఉంది. ఆయ‌న పై ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గం లోని ముస్లిం మైనార్టీలు తీవ్ర‌ ఆగ్ర‌హం తో ఉన్నారు. వైసీపీకి ముస్లిం మైనార్టీలు మొద‌టి నుంచి బ‌ల‌మైన ఓటు బ్యాంకు అన్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ సీఎం అయ్యాక సీమ నుంచే ఇద్ద‌రు మైనార్టీ ల‌ను ఎమ్మెల్సీ ల‌ను చేశారు. హిందూపురం ఇన్ చార్జ్ మ‌హ్మ‌ద్ ఇక్బాల్ తో పాటు రాయ‌చోటి కి చెందిన జ‌కీయ ఖానుమ్ ను ఎమ్మెల్సీ ల‌ను చేశారు. ఇక విజ‌య వాడ‌లో ఓ మ‌హిళా కార్పోరేట‌ర్ కు సైతం ఎమ్మెల్సీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు బ్రిజేంద్ర ఓ ముస్లిం ప్ర‌జా ప్ర‌తినిధి తో బ‌ల‌వంతంగా రాజీనామా చేయిం చ‌డం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం గా మారింది. అస‌లు విష‌యం లోకి వెళితే నియోజ‌క వ‌ర్గ కేంద్ర‌మైన  ఆళ్ల‌గ‌డ్డ మండ‌లంలోని కోట‌కందుకూరు స‌ర్పంచ్‌గా కొలి దాదాపీర్ గెలిచాడు. అయితే ఆయ‌న ఎంపీ టీసీ కూడా గెల‌వ‌డం మ‌రో ట్విస్ట్‌. ఎమ్మెల్యే అక్క‌డ ముస్లిం ల ఇష్టాల‌తో సంబంధం లేకుండా దాదాపీర్ తో బ‌లవంతంగా స‌ర్పంచ్ ప‌ద‌వికి రాజీనామా చేయించాడ‌ని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే వెర్ష‌న్ మ‌రోలా ఉంది. ఆయ‌న ఎంపీటీసీ కూడా గెలిచారు క‌దా.. రెండు ప‌ద‌వులు ఉన్నందునే తాను స‌ర్పంచ్ ప‌ద‌వికి రాజీనామా చేయించాన‌ని అంటున్న‌ట్టు టాక్ ?

అయితే ముస్లింలు మాత్రం త‌మ‌కు స‌ర్పంచ్ ప‌ద‌వే ఉండాల‌ని ప‌ట్టు బ‌డుతున్నారు. ఎమ్మెల్యే మాత్రం స‌ర్పంచ్ ప‌ద‌విని త‌న వ‌ర్గానికే చెందిన బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన శీను అనే వ్య‌క్తిని నిల‌బెట్టి గెలిపించు కోవాల‌ని చూస్తున్నార‌ట‌. అక్క‌డ ముస్లింల ఓట్లు 1600 ఉంటే.. బ‌లిజ‌ల‌వి 900 నుంచి వెయ్యి వ‌ర‌కు ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్క‌డ స‌ర్పంచ్ ప‌ద‌వికి జ‌రిగే ఉప ఎన్నిక‌ల‌లో ఎమ్మెల్యే నిల‌బెట్టిన శీను అనే వ్య‌క్తి ని ఓడించాల‌ని అక్క‌డ ముస్లింలు క‌సితో ఉన్నారు. అక్క‌డ రిజ‌ల్ట్ తేడా వ‌స్తే బ్రిజేంద్ర కు పెద్ద షాకే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: