భారత పొరుగుదేశమైన శ్రీలంకలో రోజురోజుకు ఆర్థిక సంక్షోభం పెరిగిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రభుత్వం మొత్తం  అయోమయంలో పడి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణంగా శ్రీలంక మొత్తం వ్యవసాయ రంగం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అక్కడి ప్రభుత్వానికి కూడా వ్యవసాయ రంగం నుంచి ఎక్కువగా ఆదాయం వస్తూ ఉంటుంది. కానీ కొంత కాలం నుంచి శ్రీలంకలో వ్యవసాయరంగం పూర్తిగా దెబ్బతింది. దీంతో అక్కడ ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రపంచ దేశాల సహాయం కోసం శ్రీలంక దీనంగా ఎదురుచూస్తుంది అని చెప్పాలి.



 అయితే ఇప్పటివరకు అటు భారత్-శ్రీలంక కు ఎన్నో సార్లు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కానీ ఇటీవలి శ్రీలంక ఏకంగా ఎక్కువ అప్పు ఇస్తాము అని చెప్పడంతో చైనా వైపు మళ్ళింది. చైనా అప్పు ఇచ్చినట్లు ఇచ్చి శ్రీలంకలోని ఎన్నో విలువైన భూభాగాలను కూడా తమ వశం చేసుకుంది. దీంతో శ్రీలంక కు ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ఇప్పుడు శ్రీలంక భారత్ ను ఒక సహాయం కోరుతుంది. కానీ ఈ విషయంలో భారత్ కాస్త అయోమయంలో పడిపోయింది. ఇటీవల శ్రీలంక ఏకంగా భారత్ 50 కోట్ల డాలర్ల అప్పు అడిగింది.



 ఇండియా భారత్ ఎకనామిక్ అగ్రిమెంట్ లో భాగంగా సహాయం చేయాలని కోరింది. తమ దేశం లో వచ్చే జనవరి నాటికి సరిపోయే పెట్రోల్ నిల్వలు మాత్రమే ఉన్నాయని భారత్ ఆర్థిక సాయం చేసి అప్పు ఇస్తే పెట్రోలు నిల్వలను పెంచు కుంటాము అంటూ తెలిపింది. అయితే భారత్ సహాయం చేయడానికి సిద్ధం గా ఉన్నప్పటికీ శ్రీలంక మళ్ళీ తిరిగి ఎలా ఇస్తుంది అనే విషయం లో మాత్రం భారత్ అయోమయం లో పడి పోయింది. ఇలా శ్రీలంక ఆర్థిక పరిస్థితి కనీసం పెట్రోల్ కొనుక్కో లేని విధంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: