తాలిబన్ల చేతిలో నలిగిపోతున్న  ఆఫ్ఘనిస్తాన్  లో రోజు రోజుకు పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా తాలిబన్లు   మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మొదట ఆఫ్ఘనిస్థాన్లో తమ ఆధిపత్యాన్ని చేపట్టిన తాలిబన్లు తాము పూర్తిగా మారిపోయాము.. మహిళలకు సముచిత గౌరవం కల్పిస్తామంటూ ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చారూ. ఇలాంటి స్టేట్ మెంట్ తో ప్రపంచ దేశాలను నమ్మించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారి అసలు స్వరూపాన్ని బయట పెట్టడం మొదలుపెట్టారు. మహిళలపై ఎంతో కఠినమైన ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు తాలిబన్లు.



 దీంతో తాలిబన్ల పాలనలో  మహిళల జీవితాలు కాస్తా మొత్తం ప్రశ్నార్థకంగానే మారిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తాలిబన్ల  ప్రభుత్వాన్ని మాత్రం అంతర్జాతీయ సమాజం అస్సలు అంగీకరించడం లేదు. దీనికి ముఖ్య కారణం తాలిబన్లు మహిళల పట్ల చూపిస్తున్న తీవ్రమైన వివక్ష కావడం గమనార్హం. మహిళలను కనీసం ఉద్యోగాలు చేయడానికి అనుమతించడం లేదు తాలిబన్లు. అంతేకాదు బాలికల విద్య పై పూర్తిగా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం తాలిబన్ల తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.



 ఇలాంటి సమయంలో ఏ దేశం కూడా ఆఫ్ఘనిస్తాన్ తో  సత్ సంబంధాలు కొనసాగించేందుకు ముందుకు రావడం లేదు అని చెప్పాలి. దీంతో అటు ఆఫ్ఘనిస్థాన్లో రోజురోజుకు అన్నిరకాల సంక్షోభాలు పెరిగిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం అయితే అక్కడ ఎంతగానో వేధిస్తుంది. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ సమాజాన్ని నమ్మించేందుకు తాలిబన్లు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటివరకు బాలికల విద్యపై నిషేధం విధించిన  తాలిబన్లు ఇప్పుడు మాత్రం బాలికలు యువతులు కూడా పాఠశాలలు కళాశాలల్లో చదువుకునేందుకు అనుమతిస్తాము అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కో-ఎడ్యుకేషన్ కాకుండా కేవలం ప్రత్యేకంగా మహిళల కోసం పాఠశాలలు ప్రారంభిస్తామని మహిళలు తోనే వారికి విద్యాబోధన చేయిస్తాము అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలా మేము మారిపోయాము అంటూ ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ సహాయం పొందాలని చూస్తున్నారు తాలిబన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: