ఏపీలో జనసేన పార్టీ ఇప్పుడుప్పుడే ఫామ్‌లోకి వస్తుంది...పవన్ కల్యాణ్ దూకుడు రాజకీయాలు చేయడంతో, ఆ పార్టీ నేతలు కూడా బాగా యాక్టివ్ అయ్యి, పార్టీ కోసం గట్టిగానే నిలబడుతున్నారు. అలాగే ప్రజా సమస్యలపై ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎలాగో దారుణమైన ఫలితాలు తెచ్చుకున్నారు....కానీ ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటాలని జనసేన చూస్తోంది. టి‌డి‌పితో పొత్తు పెట్టుకోవాలని కూడా చూస్తున్నట్లు ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే.

అయితే టి‌డి‌పితో పొత్తు ఉన్నా లేకపోయినా కొన్ని సీట్లలో జనసేన సత్తా చాటేలా కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా అమలాపురం అసెంబ్లీ స్థానంలో జనసేనకు మంచి అవకాశం ఉందని చెప్పొచ్చు. అక్కడ మంత్రి పినిపే విశ్వరూప్‌కు టి‌డి‌పితో కంటే జనసేనతోనే ఎక్కువ తలనొప్పి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ జనసేన చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఈ సారి సత్తా చాటాలనే కసితో జనసైనికులు పనిచేస్తున్నారు.

ఎలాగైనా తమకు పట్టున్న స్థానాలని వదులుకోకూడదని చూస్తోంది. ఈ క్రమంలోనే అమలాపురంపై కన్నేసింది. పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో టి‌డి‌పి కంటే జనసేన బెటర్ ఫలితాలు దక్కించుకుంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విశ్వరూప్‌కు చెక్ పెట్టాలని జనసేన చూస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు దాదాపు 45 వేల ఓట్లు పడ్డాయి. అటు టి‌డి‌పికి 46 వేల ఓట్లు పడ్డాయి.

అంటే దాదాపు టి‌డి‌పికి దగ్గరగా జనసేనకు ఓట్లు వచ్చాయి. ఇక వైసీపీకి 72 వేల ఓట్లువచ్చాయి. కాకపోతే అప్పుడు జగన్ గాలి ఉండటం వల్ల వైసీపీకి అన్నీ ఓట్లు వచ్చాయి. కానీ ఈ సారి పరిస్తితి ఉండే ఛాన్స్ లేదు. పైగా విశ్వరూప్‌పై ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతుంది. ఇక టి‌డి‌పితో పొత్తు ఉంటే ఈ సీటు దక్కించుకుని సత్తా చాటాలని జనసేన భావిస్తోంది. ఒకవేళ పొత్తు లేకపోయినా సరే విశ్వరూప్‌కు జనసేనతోనే పెద్ద తలనొప్పి ఉందని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: