అధికార వైసీపీలో యువ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు..గత ఎన్నికల్లో జగన్...యువతకు ఎక్కువ సీట్లు కేటాయించారు. పార్టీ భవిష్యత్ బాగోవాలంటే యువతకు పెద్ద పీఠ వేయాలనేది జగన్ ప్లాన్. అందుకు తగ్గట్టుగానే గత ఎన్నికల్లో జగన్ చాలామంది యువ నేతలకు టికెట్లు ఇచ్చారు. అలాగే జగన్ వేవ్‌లో యువ నేతలు ఎమ్మెల్యేలుగా గెలిచి సత్తా చాటారు. అయితే జగన్ వేవ్‌లో గెలిచిన యువ ఎమ్మెల్యేలు కొందరు...సొంత ఇమేజ్ పెంచుకునే పనిలో ఉన్నారు.

ఈ రెండున్నర ఏళ్లలో ప్రజలకు అండగా ఉంటూ, మంచి ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అలా ఫాలోయింగ్ పెంచుకుంటున్న వారిలో గుడివాడ అమర్నాథ్ ఒకరు. అమర్నాథ్...తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న అనకాపల్లిలో సత్తా చాటారు. అనకాపల్లిలో టి‌డి‌పి ఆరు సార్లు గెలిచింది. 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టి‌డి‌పి తరుపున పీలా గోవింద సత్యనారాయణ గెలిచారు.

ఆ ఎన్నికల్లో అమర్నాథ్ వైసీపీ తరుపున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్...అమర్నాథ్‌కు అనకాపల్లి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇక అప్పటికే టి‌డి‌పి మీద నెగిటివ్ వచ్చేసింది...దీనికి తోడు జగన్ వేవ్ ఒకటి ఉంది. దీంతో అమర్నాథ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా సరే....ప్రజలకు ఏం కావాలో బాగా తెలిసిన నాయకుడు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తున్న నేత. పథకాలు అందించడంలో గానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో గానీ ముందున్నారు.

ఇలా ప్రజల కోసం నిలబడుతున్న అమర్నాథ్‌కు నెక్స్ట్ మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి పదవి వస్తే అనకాపల్లిలో అమర్నాథ్‌కు చెక్ పెట్టడం కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పటికే సొంత పార్టీలో ఉన్న సీనియర్ నేత దాడి వీరభద్రరావు..అమర్నాథ్‌కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. కానీ అది పెద్దగా సాధ్యం కావడం లేదు. ఇక్కడ టి‌డి‌పి కూడా పెద్దగా పికప్ అవ్వలేదు. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో అనకాపల్లిలో అమర్నాథ్‌కు మళ్ళీ తిరుగులేదనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: