ట్విట్టర్.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో రాజకీయంగా చాలా ప్రభావితమైన మాధ్యమం ట్విట్టర్. అందుకే.. ఈ ట్విట్టర్‌పై ఏకంగా కేంద్ర టెలికాం శాఖ మంత్రి సైతం గతంలో విమర్శలు చేశారు. అందులోనూ ట్విట్టర్ సాధారణంగా ఎవరి మాటా వినదు. అసలు దేశంలో ఏం జరుగుతోంది. ఏ అంశం గురించి జనం బాగా చర్చించుకుంటున్నారు. ఏ అంశం ఇప్పుడు బాగా ఫాలో అవుతున్నారు.. ఇవాళ్టి హాట్ టాపిక్‌ ఏంటి.. ఇలాంటి సమాచారం కావాలంటే అందుకు ఉన్న ప్రధాన వేదిక ట్విట్టర్.


దేశంలో ఎక్కువ మంది చర్చించుకున్న అంశం.. అందులోనూ సోషల్ మీడియాలో చర్చించుకున్న అంశాలను ట్విట్టర్ గుర్తిస్తుంది. ఏ అంశం గురించి ఎక్కువగా ట్వీట్ చేస్తే.. అది ట్రెండింగ్‌లో ఉంటుంది. అలాంటిది.. మంగళవారం ఏపీలో జరిగిన వైసీపీ దాడుల అంశం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. టీడీపీ పార్టీ ఆఫీసులపై వైసీపీ శ్రేణుల దాడుల పర్వం ప్రారంభం కాగానే.. టీడీపీ సోషల్ మీడియా సెల్ యాక్టివేట్ అయ్యింది. వెంటనే #YCPTerroristsAttack అనే ట్యాగ్‌తో ట్రెండింగ్ చేయడం ప్రారంభించినట్టున్నాయి.


దీంతో ఏపీలో వైసీపీ దాడుల అంశం ఇప్పుడు ట్రెండింగ్‌లో నడుస్తోంది. ఈ కథనం రాసేపట్పటికి దాదాపు పాతిక వేలకు పైగా ట్వీట్లతో ఈ అంశం ఇండియాలో నే నెంబర్ వన్ ట్రెండింగ్‌ గా ఉంది. వైసీపీ దాడులు టెర్రరిస్టులను తలపిస్తున్నాయనే అర్థం వచ్చేలా వైసీపీ టెర్రరిస్ట్ ఎటాక్‌ అనే హ్యాష్ టాగ్‌ తో ఈ అంశం బాగా ట్రెండింగ్ అవుతోంది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైసీపీ దాడుల అంశం వెలుగులోకి వచ్చేసినట్టే.. అసలు ఏంటీ వైసీపీ టెర్రర్ అటాక్స్‌ అని కాస్తో కూస్తో ఆసక్తి ఉన్న నెటిజన్లు కచ్చితంగా ఈ అంశంపై దృష్టి సారిస్తారు. మొత్తానికి ఇలా వైసీపీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీడీపీ తన విమర్శల్లో ఈ అంశాన్ని కూడా జోడిస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: