టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా ఇవాళ టీడీపీ బంద్‌కు పిలుపు ఇచ్చింది. నిన్న మధ్యాహ్నం సీఎం ను ఉద్దేశించి పట్టాభి చేసిన కామెంట్లు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న సాయంత్రం నుంచే ఏపీలో రాజకీయం రాజుకుంది. ఏపీలోని దాదాపు అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఏకంగా పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాదాపు 200 మంది వరకూ వచ్చి దాడి చేసి వెళ్లారు. దీనికి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చింది.


అయితే వైసీపీ దాడుల నేపథ్యంలో టీడీపీ నాయకత్వం కూడా దూకుడు ప్రదర్శించింది. నిన్న సాయంత్రం నుంచి టీడీపీ అనుకూల మీడియాలో ఈ దాడుల అంశం తప్ప వేరే ఏదీ కనిపించలేదు.
దీంతో కాస్త డైలమాలో పడిన వైసీపీ నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టింది. టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తే.. వైసీపీ కూడా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇవాళంతా ఏపీలో రచ్చరచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ప్రతిపక్షం బంద్ అనగానే సాధారణంగా టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద అర్థరాత్రి నుంచే పోలీసులు మోహరిస్తారు. నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటారు. ఒకరిద్దరు వచ్చినా అరెస్టు చేస్తారు. అదే సమయంలో వైసీపీ నిరసనలకు మాత్రం అడ్డు తగిలే అవకాశాలు కనిపించడంలేదు. బంద్ కారణంగా టీడీపీ హైలెట్ అయ్యే అవకాశాలు ఉండటంతో కాస్త డైవర్షన్ కోసం అదే రోజు వైసీపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది.


టీడీపీ బంద్‌ను విఫలం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు పట్టాభి మాట్లాడిన పరుష పదజాలాన్ని బోస్‌డీకే.. ఏంట్రా.. బానిస.. వంటి పదజాలం వాడిన విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. మొత్తానికి స్తబ్దుగా ఉన్న ఏపీ రాజకీయాలు పట్టాభి నోటి దూల పుణ్యమా అని మరోసారి వేడెక్కాయి. ఈ పరిస్థితులు ఎక్కడి వరకూ వెళ్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: