ప్రస్తుతం భారత్ కరోనా ని విజయవంతంగా ఎవరూ ఊహించని విధంగా ఎదుర్కొని నిలబడటం జరిగింది. అలాగే సొంతగా టీకాను  తయారు చేసింది, ప్రపంచానికి కూడా అందించింది. ఇలా ఈ సమయంలో భారత్ ప్రపంచానికి చేసిన మేలుతో దానిపై ఆయా దేశాలకు ఉన్న అభిప్రాయాలలో మార్పులు వచ్చేశాయి. దీనితో భారత్ ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ఇక చైనా కరోనా ప్రపంచానికి అంటించిందనే నిందను మోయాల్సి వచ్చింది. దాదాపు దానిని ప్రపంచం మరిసిపోయినంత పని జరిగింది. ఇది చైనా సహించలేకపోయింది, భారత్ నిజంగానే దానిని దాటేస్తుందనే భయానికి లోనైంది. అందుకే సొంత దేశంలో కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు అధ్యక్షుడు జిన్ పిన్.

ఈ వ్యతిరేకతలన్నిటిని ఒక్కసారిగా తనకు అనుకూలంగా మార్చడానికి ఉన్న ఒకేఒక దారి భారత్ ను మళ్ళీ కిందకు లాగేయడం. అందుకు ప్రయత్నిస్తున్నప్పుడు అడ్డు వస్తుంది భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. అందుకే ఇక ఆ ప్రభుత్వం గద్దె ఎక్కకుండా ఉండే వ్యూహాన్ని పన్నింది. అదే యుద్ధం, ఈ యుద్ధంలో తనతో పాక్, అలాగే భారత్ లో ఉన్న పాక్ ప్రేరేపిత స్లీపర్ సెల్స్, ఇతర దేశద్రోహులతో కలిసి అనేక పన్నాగాలు పన్నుతోంది. ఒక్కసారి యుద్ధం చేసి తనకు కావాల్సిన లేదా భవిష్యత్తులో ఆధిపత్యం సాధించగలిగే ప్రాంతాలైన అరుణాచల ప్రదేశ్ మరియు లఢక్ లపై కన్నేసింది. యుద్ధం వస్తే ఆ రెంటిని తాను స్వాధీనం చేసుకుని వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక పాక్ కాశ్మీర్ ను స్వాధీన చేసుకుంటుంది. అప్పుడు భారత్ సరిహద్దులలో సగం వరకు వీళ్లిద్దరు ఉంటారు కాబట్టి అనుక్షణం తొక్కిపెట్టి ఉంచవచ్చు అనేది ఒక నియంత నీచమైన ఆలోచన.

మొత్తానికి చైనా అధ్యక్ష పదవి శాశ్వతం చేసుకోవడానికి మాత్రమే ఈ యుద్ధం చేస్తున్నాడు జిన్ పిన్. అలాగే భారత్ ఇక ఎప్పుడు తలెత్తుకు తిరగకుండా ఈ దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు జిన్. ఇక యుద్ధం వస్తే భారత్ ప్రధానంగా చైనా పై దృష్టిపెట్టాలి, అలాగే పాక్ పై ద్రుష్టి పెట్టాలి, ఇక ప్రాంతీయంగా తీవ్రవాదం, ఇతర దేశద్రోహుల పన్నాగాలు అమలు కాకుండా చూడాలి, ఇవన్నీ చూస్తూ, ప్రజల బాగోగులు, వాళ్ళ జీవన ప్రమాణాలు యుద్ధాల వలన పడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ భారత్ యుద్ధం చేయడం అసాధ్యం అనేది జిన్ వ్యూహం అంచనా. ఇక భారత్ ఓడిపోతే బీజేపీ జీవితంలో అధికారంలోకి వచ్చే అవకాలు ఉండవు అనేది కూడా జిన్ వ్యూహమే. అంటే ఇతర పార్టీల తో కలిసి కాంగ్రెస్ లాంటివి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వాళ్ళతో బేరసారాలు జరిపి దేశాన్ని నిత్యం తన గుప్పెట్లో ఉంచుకోవాలి అనేది జిన్ వ్యూహం. ఈ వ్యూహాన్ని భారత్ ఎలా తిప్పికొట్టనుంది అనేది వేచి చూడాలి. దీనికి ప్రజల సహకారం అత్యవసరం అనేది పౌరులు గ్రహిస్తే సుసాధ్యమే.

మరింత సమాచారం తెలుసుకోండి: