ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. ఒకే సమయంలో రాష్ట్రంలోని అనేక టీడీపీ కార్యాలయాలను టార్గెట్ గా చేసుకొని, బీభత్సం సృష్టించారు. ఈ ఘటనల్లో చాలాచోట్ల టీడీపీ కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి. ఈ వరుస ఘటనలతో టీడీపీ నేతలు రియాక్ట్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అమితాషా తో ఫోన్లో మాట్లాడారు. గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వెంటనే స్పందించారు.

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి విషయం తెలియగానే ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడి విషయంపై మాట్లాడుతూ తెలివిగా వ్యవహరించారు. దాడుల విషయాన్ని ఖండించారే కానీ ఎక్కడా బంద్ విషయం మాట్లాడలేదు. అసలు జనసేన బంద్ కి మద్దతిచ్చినట్టు ఎక్కడా చెప్పలేదు. బంద్ విషయమే ప్రస్తావించలేదు కూడా.. అసలే టీడీపీ, జనసేన కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో చాకచక్యంగా మాట్లాడారు. టీడీపీ కార్యాలయాలపై దాడి చేసింది ఎవరైనా తప్పేనన్నారు.

టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇలా పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో సరికావని అన్నారు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు తేడాగా ఉంటాయని.. అయితే ఇలా అరాచకాలు చేస్తే.. అది దౌర్జన్యానికి దారి తీస్తుందని చెప్పారు. కేంద్ర హోంశాఖ ఈ ఘటనపై దృష్టి పెట్టాలన్నారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పుకొచ్చారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు. ఏది ఏమైనా ఈ గొడవల విషయంలో పవన్ కళ్యాణ్ ఆచితూచి మాట్లాడారు. అసలైన రాజకీయ నాయకుడు ఎలా వ్యవహరించాలో, అచ్చంగా అలాగే మాట్లాడారు. వైసీపీని నేరుగా టార్గెట్ చేయలేదు. అలాగని టీడీపీకి పూర్తిగా మద్దతివ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: