సీ ఓట‌ర్ స‌ర్వేలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు అయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్ర ప్రదేశ్  సీఎం వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డి అయ్యాయి. ఇక ఏపీ ఎమ్మెల్యేలు రెండున్నరేళ్లలో ప్రజా వ్యతిరేకతను బాగా మూటగట్టుకున్న‌ట్టు కూడా స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇక ఏపీ ప్ర‌జా ప్ర‌తినిధులు దేశంలో తీవ్ర‌మైన ప్ర‌జాగ్ర‌హం ఎదుర్కొంటోన్న వారికి రికార్డుల‌కు ఎక్కారు.

ఐఏఎన్‌ఎస్‌ - సీ ఓటర్‌ పరిపాలన సూచీ పేరిట జ‌రిగిన ఈ స‌ర్వే లో దేశంలోనే తీవ్ర‌మై న ప్ర‌జాగ్ర‌హం ఏపీ లో అధికార పార్టీ ఎమ్మెల్యే ల‌పైనే ఉండ‌డం విశేషం. దీనిని బ‌ట్టి ఇక్క‌డ ఎమ్మెల్యే ల‌పై ఏ స్థాయిలో వ్య‌తిరేక‌త ఉందో తేట తెల్ల‌మ‌వుతోంది.

ఏపీలో ఎమ్మెల్యేలపై 28.5శాతం మంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయ‌గా.. ఈ జాబితాలో రెండో స్థానంలో గోవా ఉంది. గోవా లో ఎమ్మెల్యే ల‌పై 24. 3 శాతం ప్ర‌జాగ్ర‌హం ఉంది. ఇక ముఖ్య మంత్రుల విష‌యానికి వ‌స్తే దేశంలోనే ఎక్కువ వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న సీఎం ల‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలిస్థానంలో నిలిచారు. ఆయనపై 30.30శాతం మంది ప్ర‌జ‌లు ఆగ్రహం వ్యక్తం చేయ‌గా.... యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పై 28.1 శాతం ప్ర‌జా గ్ర‌హంతో రెండో స్థానంలో ఉన్నారు. గోవా ముఖ్య‌మంత్రి కూడా 27 శాతం తో మూడో స్థానంలో ఉన్నారు.

ఇక అతి త‌క్కువ ప్ర‌జా గ్ర‌హం ఉన్న ఎమ్మెల్యేల్లో కేరళ, గుజరాత్‌, మహారాష్ట్రలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కేరళలో ఎమ్మెల్యేలపై కేవలం 6.8శాతం వ్య‌తిరేక‌త ఉంద‌ట‌. ఇక అతి త‌క్కువ వ్య‌తిరేక‌త ఉన్న ముఖ్య‌మంత్రుల్లో ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, ఒడిసా ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రా ల‌లో అధికార పార్టీ ల‌పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: