ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇవాళ బంద్ కు  పిలుపునిచ్చిన సంగతి మనందరికీ విధితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఒక్క శాతం కూడా తీయకూడదని పలు సంఘాలకు మరియు నాయకులకు తెలుగుదేశం పార్టీ. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయనీ... ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కచ్చితంగా  విధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని... డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు. 

అసలు తాను ఇంతవరకు ఎప్పుడు బంద్ లకు పిలుపు ఇవ్వలేదని...  ప్రస్తుతం వైసిపి దారుణాల కారణంగా ఇలాంటి బంద్ కు పిలుపు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 350 ఆర్థిక అమలు చేయాలని... తెలుగుదేశం పార్టీ మునుపెన్నడూ డిమాండ్ చేయలేదని... కానీ ప్రస్తుతం వైసీపీ సర్కార్ చేస్తున్న అరాచకాల కు.. ముగింపు పలకాలంటే ఆర్టికల్ 356 ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది.

అటు బంద్ అమలు కాకుండా అడుగడుగున.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు. వరుసగా తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ బంద్ పిలుపునకు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇప్పటివరకు మద్దతు తెలపలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి.. పై తెలుగుదేశం పార్టీ నేత అసభ్యకర పదజాలంతో దూషించారని... ఇది చాలా తప్పు అని పేర్కొంది విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్. కాబట్టే తాము బంద్ కు దూరం ఉన్నట్లు స్పష్టం చేసింది. కరుణ కష్టకాలంలో ఇలా బంద్  కార్యక్రమాలు చాలా తప్పని అభిప్రాయపడింది విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: