రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులపై ఐఏఎన్ఎస్‌- సీ ఓటర్ సర్వేలో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ ల‌పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఈ స‌ర్వే ప్ర‌కారం దేశంలోనే తీవ్ర‌మైన ప్ర‌జా గ్ర‌హం ఎదుర్కొంటో న్న ఎమ్మెల్యే ల‌లో ఏపీ ఎమ్మెల్యేలు అగ్ర స్థానంలో ఉన్నారు. ఏపీలో ఉన్న ఎమ్మెల్యే ల‌లో ఏకంగా 28 % కు పైగా ఎమ్మెల్యేలు తీవ్ర ప్ర‌జా గ్ర‌హంతో కొట్టు మిట్టాడుతున్నారు. మ‌హా అయితే ఇప్ప‌టికి ఏపీలో జ‌గ‌న్ పాల‌న ప్రారంభ‌మై రెండు న్న‌ర సంవ‌త్స‌రాలు అవుతోంది.

ఇంకా రెండున్న రేళ్ల పాల‌న ఉంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేవ‌లం సంక్షేమాన్ని మాత్ర‌మే బేస్ చేసుకుని పాల‌న చేస్తుందే త‌ప్పా.. అభివృద్ధి అన్న మాటే విన‌ప‌డ‌డం లేదు. అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల లో చాలా మంది ప్ర‌జ‌ల్లో ఉండ‌డం లేద‌నే తెలుస్తోంది. ఈ తీవ్ర ప్ర‌జాగ్ర‌హం ఎదుర్కొంటో న్న‌ ఎమ్మెల్యేలు అత్యధిక మంది మొదటి సారి గెల్చిన వాళ్లే ఉన్నారు. అయితే తెలంగాణ‌లో ప‌రిస్థితి వేరు. అక్క‌డ ఎమ్మెల్యే ల‌పై ప్ర‌జాగ్ర‌హం ఏపీ తో పోలిస్తే త‌క్కువ గానే ఉంది.

అక్క‌డ సీఎం కేసీఆర్ పై ప్ర‌జ‌ల్లో తీవ్ర  అసంతృప్తి ఉంది. ఆ మాట‌కు వ‌స్తే దేశంలోనే ఎక్కువ ప్ర‌జాగ్ర‌హం ఎదుర్కోంటోన్న సీఎం ల‌లో కేసీఆర్ ఫ‌స్ట్ ప్లేసు లో ఉన్నారు. ఏపీలో మాత్రం ఎమ్మెల్యే ల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర మైన వ్య‌తిరేక త వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ల‌ను మార్చ‌కుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ తిరిగి వీరికే సీట్లు ఇచ్చి ఎన్నిక‌ల‌కు వెళితే జ‌గ‌న్ కు షాక్ త‌ప్ప‌ద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

అందుకే జ‌గ‌న్ ఈ సారి వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఎక్కువ మంది సిట్టింగ్ ల‌ను మార్చ‌క‌పోతే అధికారానికి దూరం కాక త‌ప్ప‌ద‌నే చెప్పాలి. మ‌రి జ‌గ‌న్ తీవ్ర ప్ర‌జాగ్ర‌హం ఎదుర్కొంటోన్న వారిలో ఎంత మందిని ప‌క్క‌న పెట్టేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: