పార్టీ ఎంపీకైనా.. ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఉండాల‌ని కోరుకుంటారు. ప్ర‌జ‌ల్లో గుర్తింపు ఉంటేనే.. మ‌ళ్లీ మ‌ళ్లీ గెలిచేం దుకు అవ‌కాశం ఉంటుంది. అయితే.. దీనికిభిన్నంగా.. ఇప్పుడు వైసీపీ ఎంపీ ఒకరు ఢిల్లీలో జెండా ఎగ‌రేస్తు న్నారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ఆయ‌న ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డిపోయింది. దీంతో ఆ ఎంపీ.. ఇంట్లో ఈగ‌ల మోత‌.. బ‌య‌ట ప‌ల్ల‌కీల మోత చ‌విచూస్తున్నార‌ని అంటున్నారు ప్ర‌త్య‌ర్థులు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరికి కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో అరుదైన అవ‌కాశం ఇచ్చింది.

ప్రస్తుతం సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ  చైర్మన్ గా పనిచేస్తున్న  బాలశౌరిని రెండవసారి కూడా ఇదే క‌మిటీకి చైర్మ‌న్‌గా నియ‌మించింది. ఈ మేర‌కు లోక్ సభ స్పీకర్  ఓం ప్రకాష్ బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం తొలి సారి బాలశౌరి సబార్డినేట్ లేజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా నియమితులైన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది కాలంలో కమిటీ చైర్మన్ గా బాలశౌరి వివిధ ప్రభుత్వ శాఖలతోనూ, ప్రభుత్వ రంగ సంస్థలతోనూ విస్తృతం గా  సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు.  ముఖ్యంగా ఇంధన రంగ సంస్థలతో సమావేశాలు నిర్వహించి, వాటి స్థితులను గమనించి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు.  

అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతం అయిన లడాఖ్ లోని లెహ్, జమ్మూ కాశ్మీర్ లోని శ్రీ నగర్ లో ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్ , ఎండీల‌తో చ‌ర్చించి ప్రభుత్వానికి నివేదికలు అందించారు. ఈ నేప‌థ్యంలోనే  బాల‌శౌరి సామ‌ర్థ్యం గుర్తించిన కేంద్రం ఆయ‌న‌ను రెండో సారి నామినేట్ చేసింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితికి వ‌ద్దాం. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి దాదాపు రెండేళ్లు కావొస్తోంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. అంతేకాదు.. ఇక్క‌డ ఎలాంటి అభివృద్ధి లేద‌ని కూడా చెబుతున్నారు. క‌నీసం .. ఎ న్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని, వ‌చ్చినా.. గెస్ట్‌హౌస్‌కు ప‌రిమిత‌మై.. త‌న ప‌నితాను చేసుకుని పోతున్నార‌ని అంటున్నారు.

సో.. బ‌య‌ట బాగానే గుర్తింపు ఉన్నా.. ఇంట్లో మాత్రం.. ఎంపీకి సెగ బాగానే పెరుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఢిల్లీలో ఎన్ని మార్కులు ఉన్నా.. రేపు ఎన్నిక‌ల్లో గెలిపించాల్సింది.. ప్ర‌జ‌లేన‌ని.. కొంత వారికి కూడా స‌మ‌యం కేటాయించాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఎంపీగారు నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెడ‌తారో లేదో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: