గాంధీ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి… ప్రమాద వివరాలను మీడియాకు వివరించారు. డీఎంఈ రమేష్ రెడ్డి మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ అవ్వటంతో గాంధీలో ఈ ప్రమాదం జరిగింది అని ఆయన తెలిపారు. గాంధీలోనే ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేసాము అని పేర్కొన్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి 15నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు అని ఆయన తెలిపారు. ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అన్నారు ఆయన.

పరికరాలు పాడవ్వలేదు అని 120 పేషేంట్లను పక్క వార్డులోకి తరలించాము  అని వివరించారు. 2 రోజుల్లో అంత క్లియర్ చేస్తాము అని అన్నారు. ఎలక్ట్రికల్ వాళ్లకు పక్క వార్డులలో కూడా ఉన్న బోర్డులను చెక్ చెయ్యమని చెప్పాము అని వివరించారు. అన్ని ఆస్పత్రులలో ఫైర్ సిబ్బంది ఉండేలా చూస్తాం  అని వివరించారు. పెద్ద ఆస్పత్రి కాబట్టి ఒక స్టేషన్ పెట్టాము అని వివరించారు. భారతదేశంలోనే గాంధీలో ఫైర్ స్టేషన్ ఉంది అని ఆయన వివరించారు. మొదట్లో డాక్టర్లకు మాక్ డ్రిల్ నిర్వహించామని అన్నారు.

మళ్ళి ఒకసారి మాక్ డ్రిల్ ని నిర్వహించి అవగాహన కల్పిస్తాం  అని పేర్కొన్నారు. అన్ని ఆస్పత్రులలో ఇప్పటికే డాక్టర్లకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం  అని తెలిపారు. ఈ బ్లాక్ లో లిమిటెడ్ పేషేంట్లు చాలా తక్కువగా ఉన్నారు అని వివరించారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు మీడియాతో మాట్లాడుతూ... ఉదయం గాంధీ ఆస్పత్రి ఎలక్ట్రికల్ రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది అని పేర్కొన్నారు. జరిగిన వెంటనే 40 నిమిషాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి అని తెలిపారు. గాంధీ హాస్పిటల్ లో ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయి.. పాండమిక్ సిచువేషన్ లో ఫైర్ సేఫ్టీ పరికరాలన్నీ ఇక్కడ అమర్చాము అని పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని తెలిపారు. నార్త్ బ్లాక్ లో ప్రస్తుతం కరెంట్ లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts