ఇటీవలి కాలంలో వ్యవసాయం లో రసాయన ఎరువుల వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ప్రకృతి సిద్ధమైన ఎరువులను మాత్రమే వాడి పంటలు పండించేవారు. కానీ నేటి రోజుల్లో రైతులందరూ కూడా రసాయనిక ఎరువులు వాడుతూ పంటలు పండిస్తూ ఉండడం గమనార్హం. ఇలా రసాయన ఎరువులు వాడి పండించిన పంటలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు నేటి రోజులలో జనాలు. అంతేకాదు రసాయన ఎరువులు ఎంతోమంది ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఇక్కడ ఓ రైతులు రసాయన ఎరువులు కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.  దీంతో కుటుంబం మొత్తం విషాదంలో నిండిపోయింది.



 ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. పంట బాగా పండేందుకు పొలం లో పురుగుల మందు చల్లాలి అని నిర్ణయించుకున్నాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే పొలం మొత్తం పురుగుల మందు పిచికారీ చేశాడు. ఇక ఆ తర్వాత పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. కానీ కాసేపటికే ఊహించని ఘటన చోటుచేసుకుంది. రైతు అకస్మాత్తుగా కిందపడిపోయి మృతి చెందాడు. దర్శి మండలం లోని శేషం వారి పాలెం లో స్థానిక రైతు నరసింహారావు ఇలా పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి మృతిచెందాడు. అయితే సదరు రైతు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దస్తావేజు లేఖరి గా పనిచేస్తూ ఉండటం గమనార్హం.



 తనకు ఉన్న కొద్దిపాటి పొలం లో బత్తాయి తోటను సాగు చేస్తున్నాడు నరసింహారావు. ఈ క్రమంలోనే ఇటీవలే మధ్యాహ్నం సమయంలో భోజనం చేసిన తర్వాత గడ్డి మందు పిచికారి చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. కానీ కొద్దిసేపటికే నరసింహారావు అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కాగా రైతు నరసింహారావుకు భార్య జ్యోతి ముగ్గురు కుమారులు కూడా ఉన్నారు. ఇక అప్పటివరకు కళ్ళముందే ఆనందంగా ఉన్న నరసింహారావు ఒక్కసారిగా మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: