ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేసారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతీ సంవత్సరం 21 అక్టోబరు న జరుపుతాం అని అన్నారు ఆయన. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సంస్మరణ జరుపుకుంటాంఅని ఆయన తెలిపారు. సమాజ శ్రేయస్సు,భద్రత కోసం పోలీసులు పని చేస్తారు అన్నారు డీజీపీ. చాలా బాధాకరమైన, క్లిష్టమైన సమయాలు కూడా పోలీసులకు ఉంటాయి అని ఆయన తెలిపారు.

రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు పని చేస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. గత సంవత్సరం పోలీసులకు కోవిడ్ కారణంగా ఒక ఛాలెంజ్ అని అన్నారు ఆయన. పోలీసులు కోవిడ్ కాలంలో ప్రాణాలకు తెగించి సమాజ సేవ చేసారు అని వెల్లడించారు. 206 మంది పోలీసులు కోవిడ్ కారణంగా మరణించారు అని ఆయన చెప్పుకొచ్చారు. 11 మంది గత సంస్మరణ దినోత్సవం తర్వాత మరణించారు అని ఆయన అన్నారు. సమాజంలో పోలీసు కుటుంబాలతో సమానంగా ఎవరూ కష్టాలు భరించలేదు అని పేర్కొన్నారు. చాలా జాగ్రత్తలు కోవిడ్ కాలంలో పోలీసుల కోసం తీసుకున్నాం అని తెలిపారు.

ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక సదుపాయాలు కల్పించాం అని ఆయన తెలిపారు. ఏపీ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ... ఆరోపణలు చాలా వస్తాయి... వెనక్కి చూసుకుంటే నిజాలు తెలుస్తాయి అని అన్నారు. హెరాయిన్ గుజరాత్ లో దొరికినప్పటి నుంచీ ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన విమర్శలు చేసారు. ఏపీకి ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు. డీఆర్ఐ ఆ కేసును విచారణ చేస్తోంది అని అన్నారు. దాదాపు 3000 కేజీలు హెరాయిన్ దొరికింది అని పేర్కొన్నారు. విజయవాడ సీపీ, రాష్ట్ర డీజీపీ గా నేను చెప్పాం అని ఆరోపణలు సరైనవి కావు అని చెప్పాను అన్నారు డీజీపీ. సెంట్రల్ ఏజెన్సీలు కూడా ఏపీకి సంబంధం లేదని చెప్పారు అన్నారు. ఎన్ఐఏ కూడా ఏపీ కి సంబంధం లేదని చెప్పారు అని ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap