నిన్న జరిగిన సంఘటనలు దారుణం అన్నారు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్. నిన్న పట్టాభి వ్యాఖ్యలు ఇబ్బందికరమైన, రాజ్యాంగ విరుద్ధమైన భాషలో ఉన్నాయి అని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు. పోలీసులకు కూడా సరైన సమాచారం లేదు అని అన్నారు. నెల నుంచీ వచ్చిన మాటల వలన నిన్న దారుణమైన సంఘటనలు జరిగాయని వ్యాఖ్యలు చేసారు. ఒక పార్టీ కార్యాలయం నుంచీ అలాంటి దుర్భాషలు చేయడం ఒప్పుకోలేనిది అని ఆయన అన్నారు. నిన్న వాట్సప్ కాల్ ఒక కొత్త నంబరు నుంచీ వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు.

ఎస్పీ, పోలీసు స్టేషను కూడా స్పందించారు అని ఆయన వివరించారు. కేసు పరిశోధనలో ఉంది అని వ్యాఖ్యానించారు. దశాబ్దాల సమస్య గంజాయి సమస్య అని అన్నారు. గత సంవత్సర కాలం నుంచి ఎస్ఈబీ ద్వారా గంజాయిని చాలా అరికట్టాం అని ఆయన వివరించారు. గత పది సంవత్సరాల కంటే తక్కువ స్ధాయికి కేసుల సంఖ్య వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. 4వేల మందికి పైగా గంజాయి కేసులో అరెస్టు చేసాం అన్నారు.

తెలంగాణ, ఏపీ పోలీసులు కలిసి జాయింట్ రెయిడ్ లు గంజాయి విషయంలో చేసాం అని వివరించారు. హెరాయిన్ కేసులో అడ్రస్ తప్ప ఏమీ లేదని ఇప్పటికే చెప్పాము అన్నారు. పట్టాభి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చిన్న వ్యాఖ్య కాదు అని ఆయన వ్యాఖ్య చేసారు. ఒక రాజ్యాంగ సంస్థపై, ఒక ముఖ్యమంత్రి పై అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చెయ్యకూడదు అని అన్నారు. ఆ వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్ మనం చూశాం అని పేర్కొన్నారు. పోలీసులకు నిన్నటి దాడుల పై సమాచారం లేదు అని పట్టాభి నోరు జారి అన్న వ్యాఖ్యలు కాదు.... ఒక పార్టీ ఆఫీస్ నుంచి అలాంటి వ్యాఖ్యలు చెప్పించారు అని ఆయన వ్యాఖ్యానించారు. పరేడ్ లో బ్యాండ్ జరుగుతున్న సమయం లో నాకు నిన్న వాట్స్ యాప్ కాల్ వచ్చింది అని తెలిపారు. నిన్న సాయంత్రం 5.03 గంటలకు నాకు కాల్ వచ్చింది...కానీ ఆ సౌండ్స్ లో మాట్లాడలేక పోయాను అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: