ఓ విధంగా చూసుకుంటే నిన్న‌టి ప‌రిణామాలు టీడీపీ, వైసీపీ వ‌ర్గాల‌ను పూర్తి స్థాయిలో డైల‌మాలో ప‌డేశాయి. ఓ ముఖ్య‌మంత్రి స్థాయి వ్య‌క్తిని ఉద్దేశించి ప‌ట్టాభి మాట్లాడిన తీరు పై విమ‌ర్శ‌లు వ‌స్తే, ఆయ‌న మాటల్లో  ఉన్న బూతులు మిన‌హాయించి మిగ‌తా మాట‌లు గ‌మ‌నించి చూస్తే రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్న గంజాయి సంస్కృతి గురించి చెప్పిన వివ‌రం ఆవేద‌న భ‌రితంగానే ఉంద‌ని ఇంకొంద‌రు సామాన్యులు స్పందిస్తున్నారు. అయినా ఈ వ్య‌వ‌హారంలో బాబు స్ట్రాట‌జీ ప‌రంగా వెనుక‌బ‌డి పోయాడు అన్నది స్ప‌ష్టం అయిపోయింద‌ని ఇంకొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే చంద్ర‌బాబు త‌న సొంత మ‌నుషుల‌తో మాట్లాడించిన విధానం అస్స‌లు బాలేద‌ని వైసీపీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. అందుకే  తీవ్ర స్థాయిలో జ‌గ‌న్ అభిమానుల ఆగ్ర‌హం చ‌వి చూడాల్సి వ‌చ్చింద‌ని వైసీపీ అంటోంది. దాడి వెనుక త‌మ మ‌నుషులు లేనేలేర‌ని కూడా అంటోంది.

ఈ ద‌శ‌లో.. ఈ నేప‌థ్యంలో...:
చాలా రోజుల‌కు బాబు ఓడిపోయాడు. అవును! త‌ప్పిదాల‌ను దాటుకుని ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిన ప్ర‌తిప‌క్ష నేత ఇప్పుడు డైలమా లో ప‌డిపోయారు. అయితే త‌న ఫోన్ కూడా డీజీపీ ఎత్త‌డం లేద‌న్న కోపంలో ఆయ‌న ఉన్నారు. ఆ విధంగా బాబు ఓడిపోయారు. ఓ ప్ర‌తిప‌క్ష నేత గా ఉన్న తాను సమ‌స్య‌ల‌పై రిపోర్టు చేసేందుకు ఫోన్ చేస్తే ఎత్త‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌ని ఆయ‌న విస్తుబోయారు. అ యితే ఇప్పుడీ ప‌రిణామమే బాబును తీవ్ర అసంతృప్తిలో ఉంచుతోంది. సీనియ‌ర్ పొలిటీష‌న్ గా పేరున్న త‌న‌కు, త‌న మాట‌కు ఎ న్న‌డూ ఎదుర‌న్న‌ది లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం అని తెలుస్తోంది. అయితే టీడీపీ వ‌ర్గాలు మాత్రం వీటిపై వివ‌ర‌ణ మ‌రో విధంగా ఇస్తున్నాయి. బాబు ఫోన్ డీజీపీ ఎత్త‌డం లేదంటే, ఇక సామాన్యుల‌కు ఏం ర‌క్ష‌ణ ఉంటుంద‌న్న‌ది వారి వాద‌న‌. ప‌రిణామాలు ఎలా ఉన్నా టీడీపీ మాత్రం దూకుడు పెంచి నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. జాతీయ స్థాయిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం లోపాల ను, త‌ప్పిదాల‌ను వెలుగులోకి తీసుకుని రావాల‌ని కోరుకుంటోంది. ఆ విధంగా త‌న‌కు మైలేజ్ వ‌స్తుంద‌ని బాబు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: