ప్రపంచం అంతా కరోనా మహమ్మారి నుండి పూర్తిగా తప్పించుకునే లోపే అది మరోసారి కాటేస్తూనే ఉంది. మరోవైపు ప్రకృతి కూడా ఇప్పుడే ప్రకోపం చూపుతుండటంతో అనేక దేశాలలో తీవ్రమైన వానలు, వరదలు ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. వీటి వెంటే అంటువ్యాధులు వస్తుండటంతో వైద్యులకు, ప్రభుత్వాలకు తీవ్ర ఆందోళన తప్పడం లేదు. మొన్నటి వరకు భారత్ లో ఇదే పరిస్థితి. ఇప్పుడు నేపాల్ లో కూడా భారీవర్షాలతో, వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే 21మంది మృతిచెందారు. ఇంకో 24 మంది ఆచూకీ వెతుకుతున్నారు.

నేపాల్ లోని 19 జిల్లాలలో కూడా తీవ్రంగా వర్షపాతం నమోదు అయ్యింది. దీనితో దేశీయంగా విమాన సేవలు నిలిపి వేశారు. ఈ వర్షాల కారణంగా పలు పంటప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. సరిగ్గా కోతకు వచ్చే సమయానికి వర్షం పంటను నీటముంచేసింది. వేలాది ఎకరాల పంట నీటిపాలు అయిపోయింది. నేపాల్ వాతావరణ శాఖ ఎతైన కొండా ప్రాంతాలు, పర్వత ప్రాంతాలలో హిమపాతం పడే అవకాశమా ఉండటం వలన ఈ పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగుతున్నాయని హెచ్చరించింది. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీనివలన మధ్య భారత్ సహా నేపాల్ లో తీవ్రమైన ప్రాభవం ఉందని వారు తెలిపారు.

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో, అలాగే తీవ్ర వరదల ప్రాంతాలలో ప్రజలకు సాయం చేయడానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఆచూకీ తెలియని వారికోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులను వారివారి కుటుంబాలకు అప్పటించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరికొంత కాలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు సూచించారు. వరదల వలన నిరాశ్రయులు అయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదలు తగ్గేంతవరకు వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: