నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఏపీ మంత్రులు తమ కార్యకర్తలను సమర్ధించుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వైసీపీ కార్యకర్తలు ఇంకా దాడులు చేసే అవకాశం ఉందని మంత్రులు మాట్లాడటం కూడా ఆశ్చర్యపరిచింది. ఇక తాజాగా హైదరాబాద్ లో ఉన్న ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేసారు. ఏదైనా తప్పులు జరిగితే ప్రజాస్వామ్య విధానాల్లో విమర్శించాలి అని అన్నారు ఆయన. కానీ సభ్యత లేని మాటలతో విమర్శలు చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

చెప్పడానికి వీలు లేని మాటలు మాట్లాడుతున్నారు అని  మంత్రి కురసాల కన్నబాబు  వ్యాఖ్యలు చేసారు. పార్టీ ని బతికించుకోవడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న అమిత్ షా కు చంద్రబాబు కు ఫోన్ చేశారని విన్నాము అని అన్నారు. అమిత్ షా మీద దాడి చేసిన చరిత్ర చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. మీ కనుసన్నల్లోనే దాడి జరిగింది అని ఆయన విమర్శించారు. కావాలని దాడి చేయించు కున్నారని అనిపిస్తుందిఅని అన్నారు మంత్రి. ఈ బూతుల డ్రామాకు దర్శకత్వం చంద్రబాబు అని  మంత్రి కురసాల కన్నబాబు  వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబు ను ప్రధమ ముద్దాయి గా పోలీసులు కేస్ నమోదు చేయాలి అని కోరారు. టీడీపీ ని పట్టాభి నడిపించే స్థాయి కి పడిపోయింది అని వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి కైనా చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసారు. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి సంయమనం తో ఉండొచ్చు అని కానీ క్యాడర్ సంయమనం తో ఉండరు అని ఆయన స్పష్టం చేసారు. చంద్రబాబు 36 గంటల దొంగ దీక్ష చేస్తాను అంటున్నారు అని ఈ దీక్ష చేయడం కోసమే నిన్నటి నుంచి డ్రామాలు ఆడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం చంద్రబాబు అని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు అన్నారు  మంత్రి కురసాల కన్నబాబు .

మరింత సమాచారం తెలుసుకోండి:

ap