ఏపీలో నిన్నటి నుంచి వాతావరణం చాలా వేడిగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆవేదన అందరిలో నెలకొంది. రాజకీయంగా ఇప్పుడు డ్రగ్స్ కేసు విచిత్రమైన మలుపులు తిరగడం హాట్ టాపిక్ అయింది. టీడీపీ నేడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన నేపధ్యంలో ఏ పరిణామాలు ఉంటాయో అని అందరూ ఆశ్చర్యంగా చూసారు. ఇక ఇప్పుడు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మీరు మాట్లాడితే సూక్తులు, మేము మాట్లాడితే బూతులా అని ఆయన నిలదీశారు. మా నాయకుడు ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు.

ఆ రోజున నిండు సభలో గేలిచేస్తుంటే హా హా అంటూ నవ్వుకున్నారు అని అన్నారు ఆయన. గౌరవ డీజీపీ  గారు మీరు తీసుకుంటున్నా జీతం ప్రజల  డబ్బు అని  మర్చిపోకండి అంటూ హితవు పలికారు. ఇది మంచి పద్దతి కాదు డీజీపీ  గారు అని హెచ్చరించారు. కొంతమంది పెద్దలు  వాపును చూసి బలుపు అనుకుంటున్నారు అని అన్నారు. మీడియా సంస్థలు కొన్ని దద్ధమ్మలుగా ప్రవర్తిస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. మీకులాగా మేము దిగజారి మాట్లాడలేదు, మేము మాట్లాడితే మీరు కాదు మీ బాబు, మీ తాతలు కూడా తట్టుకోలేరు అని అన్నారు.

మీ పరిపాలన రామరాజ్యం అయితే మళ్ళీ మిమ్మల్నే గెలిపిస్తారు ఇలాంటి చేతకాని దద్దమ్మలా ప్రవర్తించకండి అని సూచించారు. మా పార్టీ బందులకు, సమ్మెలకు దూరంగా ఉంటుందని అన్నారు. మా ఉద్దేశాన్ని ప్రజల వరకు తీసుకువెళ్లండంలో పూర్తిగా విజయం సాధించాం అని చింతమనేని స్పష్టం చేసారు. అప్పట్లో నర్సీపట్నం దగ్గర అన్యాయంగా నన్ను అరెస్ట్ చేసి నాపై గంజాయి కేసు పెట్టాలని చూసారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరి పై కేసు వేస్తా అని చింతమనేని ప్రభాకర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: