ప్ర‌జా స్వామ్య బ‌ద్ధంగా పాల‌న సాగిస్తున్నామ‌ని టీడీపీ పై త‌మ‌కు ఎటువంటి క‌క్ష సాధింపు లేద‌ని వైసీపీ స‌ర్కారు ప‌దే ప‌దే చెబుతోంది. కానీ వాస్త‌వం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తాము ఏం అనుకుంటున్నామో అదే చేసేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది. ఇదే స‌మ‌యంలో కొన్ని త‌ప్పిదాల‌కు తావిచ్చేందుకు సైతం వెనుకాడ‌డం లేదు. అయితే వైసీపీ స‌ర్కారు వ్య‌వ‌హారం కూడా ఒక‌నాటి టీడీపీ పార్టీ వ్య‌వ‌హార శైలిని త‌ల‌పిస్తోంద‌ని కొన్ని వ్యాఖ్య‌లు సైతం వినిపిస్తున్నాయి. ఎవ్వ‌రూ త‌గ్గ‌క‌పోవ‌డం వ‌ల్లే ఇటువంటి హింసాత్మ‌క వాతావ‌ర‌ణం నెల‌కొని ఉంటోంద‌న్న వాద‌న కూడా ఉంది. ఇదే విధంగా రాజ‌కీయ సంబంధ వైరం ర‌గిలితే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య రావ‌డం ఖాయం. అదేవిధంగా మీడియా  ప్ర‌తినిధుల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. టీడీపీ నాయ‌కుల‌ను అరెస్టు చేశాక, వారి అభిప్రాయాలు సేక‌రించే ప‌నిలో జ‌ర్న‌లిస్టులు ఉంటే అప్పుడు కూడా మాట్లాడేందుకు వీల్లేద‌ని ప‌దే ప‌దే నిలువ‌రిస్తున్నారు.

టీడీపీ నాయ‌కుల‌ను అరెస్టు చేసే క్ర‌మంలో ఇవాళ పోలీసులు గ‌తంలో క‌న్నా భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. అస్స‌లు ఎవ్వ‌రినీ మాట్లా డ‌నివ్వ‌క వెంట వెంట‌నే అరెస్టులు  చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాదు  మాట్లాడుతున్న వారిని అత్యంత పాశ‌వికం గా లాక్కెళ్లారు. ఈడ్చుకెళ్లారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను కొంద‌రిపై అనుచిత రీతిలో ప్ర‌వ‌ర్తించి వైసీపీ ప్ర‌భుత్వం చెప్పిన విధంగా న‌డుచు కుంటున్నార‌న్న విమ‌ర్శ‌ల‌కు బ‌లం ఇచ్చేలా ప్ర‌వ‌ర్తించారు. అదేవిధంగా చాలా మంది నాయ‌కుల విష‌య‌మై తోచిన విధంగా ప్ర‌వ‌ర్తించడ‌మే కాకుండా వారికి క‌నీస మ‌ర్యాద కూడా ఇవ్వ‌కుండా పోలీసు వాహ‌నాల్లో ఎక్కించిన తీరు కూడా అమాన‌వీయంగానేన ఉంది. ఇదే ద‌శ‌లో మీడియా ప్ర‌తినిధులను సైతం బెదిరించారు. తాము మాట్లాడే స్వేచ్ఛ‌కూడా ఈ ప్ర‌భుత్వం లో లేదా అని ప‌లువురు నాయ‌కులు పోలీసులను నిల‌దీశారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: