ఏపీలో గ‌త కొద్ది రోజులుగా స్వామిజీలు వ‌ర్సెస్ రాజ‌కీయ నాయ‌కులు అన్న‌ట్టుగా రాజ‌కీయం న‌డుస్తోంది. ఆ మాట‌కు వ‌స్తే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రు లుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఏపీ సీఎం వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇద్ద‌రూ కూడా స్వామిజీల‌ను క‌లుస్తూ వారి స‌ల‌హాలు తీసుకుంటోన్న ప‌రిస్థితి. తెలంగాణ సీఎం కేసీఆర్ పై అన్య‌మ‌తం కు స‌పోర్ట్ చేస్తార‌న్న ఆరోప‌ణ‌లు లేవు. అయితే ఆయ‌న మైనార్టీ ల‌కు స‌పోర్ట్ చేస్తార‌ని బీజేపీ వాళ్లు మాత్రం అప్పుడ‌ప్పుడు విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. అయితే ఏపీ సీఎం జ‌గ‌న్ పై మాత్రం కులం , మ‌తం నుంచి అనేకానే క ఆరోప‌ణ‌లు తీవ్రంగా వ‌స్తున్నాయి. జ‌గ‌న్ నిన్న‌టికి నిన్న స్వామి విజ‌య‌వాడ పీఠాన్ని ద‌ర్శించు కున్నారు. దీని వెన‌క కూడా చాలా చ‌ర్చే న‌డిచింది.

విశాఖ‌ప‌ట్నం స్వామి.. ఇచ్చిన సూచ‌ల‌న మేర‌కే జ‌గ‌న్‌.. విజ‌య‌వాడ‌లోని ద‌త్త‌పీఠాన్ని ద‌ర్శించుకున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుసలు అయితే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆయ‌న జ‌గ‌న్ అన్ని మ‌తాల వారిని గౌర‌విస్తున్నార‌ని.. ఆయ‌న పాల‌న‌లో హిందూ మ‌తం ఎంతో అభివృద్ధి చెందుతుంద‌ని ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఈ రోజు జ‌గ‌న్ పై  విశాఖ‌ప‌ట్నంలో ఉన్న పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మతమార్పుడులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయ‌ని.. ఆనాడు తమిళనాడు లో జయలలిత యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చార‌ని.. ఇప్పుడు జ‌గ‌న్ కూడా జయలలిత లాగే ఈ బిల్లు పెడితే మళ్లీ ఆయన అధికారంలోకి వస్తార‌ని.. హిందూ స‌మాజం మొత్తం ఆయ‌న వెంటే న‌డుస్తుంద‌ని ప‌లు సూచ‌న‌లు చేశారు.

ఇక జ‌గ‌న్ చాలా మంది స్వామీజీల దగ్గరకువెళుతున్నారు..వారైనా ఈ విష‌యం జ‌గ‌న్ కు చెప్పాల‌ని సూచించారు. లేదంటే హిందూ స‌మాజం అంతా జ‌గ‌న్‌కు యాంటీ అవుతుంద‌ని హెచ్చ‌రించారు. క‌రోనా ఆంక్ష‌లు అన్నింటికి ఉండాల‌ని.. కానీ హిందూ పండుగ‌లు అయిన వినాయక చవితి, దసరా పండగలకే ఎందుకు పెడుతున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కరోన వైరస్ సమాజానికిపట్టలేదు...ప్రభుత్వానికి పట్టి నట్లు కనబడు తోంది అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: