ఏపీలో అధికార వైసీపీ దూకుడు దెబ్బ‌తో విప‌క్ష టీడీపీ నేత‌లు బెంబేలు ఎత్తుతున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్ర‌మే కాకుండా ప‌లువురు కీల‌క నేత‌లు అధికార పార్టీ లోకి జంప్ చేసేశారు. ఇదే పార్టీలో పెద్ద గంద‌ర గోళానికి కార‌ణ‌మైంది. మ‌రో వైపు వ‌రుస‌గా పార్టీ కీల‌క నేత‌లు బ‌య‌ట‌కు వెళ్లి పోతూ ఉండ‌డంతో పార్టీ లో మిగిలిన వారికి కూడా మ‌నోధైర్యం పోతోంది. ఇక స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో నూ టీడీపీకి ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఇక కార్పోరేష‌న్ , మునిసిప ల్స్ ఎన్నిక ల‌లో అయితే మ‌రీ ఘోర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేష‌న్ల లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.

ఇక మున్సి పాల్టీ ల‌లో కూడా కేవ‌లం అనంత‌పురం జిల్లాలోని హిందూపురం మున్సిపాల్టీ ని మాత్ర‌మే టీడీపీ గెలుచు కుంది. అది కూడా జేసీ బ్ర‌దర్స్ వ్య‌క్తిగ‌త ఇమేజ్ వ‌ల్లే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్పుడు ఏకంగా వైసీపీ వాళ్లు టీడీపీ ప్ర‌ధాన కార్యాల‌యంపై నే ఎటాక్ చేశారు. దీంతో పార్టీ కేడ‌ర్ లో ఆత్మ‌స్థైర్యం స‌న్న గిల్లు తోంది. ఇలాంటి టైంలో కీల‌క నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చి కేడ‌ర్ కు ధైర్యం చెప్ప‌డం లేదు.

పార్టీలో య‌న‌మ‌ల రామ‌కృష్ణు డు లాంటి అవుట్ డేటెడ్ లీడ‌ర్లు మాత్ర‌మే కాదు.. గ‌త ఎన్నిక‌ల‌లో గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ప‌య్యావుల కేశ‌వ్ పార్టీలో చాలా సీనియ‌ర్ అయినా ఆయ‌న ఇలాంటి టైంలో బ‌య‌ట‌కు వ‌చ్చి ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీకి ఘాటు కౌంట‌ర్లు ఇవ్వ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు సొంత పార్టీ లోనే ఉన్నాయి. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప‌య్యావుల ఎమ్మెల్యే గా ఓడిపోయారు. అయినా చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు.

అయితే ప‌య్యావుల కు ఆశ ఎక్కువ అన్న‌ట్టుగా త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని భీష్మించు కున్నారు. బాబు పై ఆయ‌న అప్ప‌టి నుంచి కోపంతోనే ఉంటూ వ‌స్తున్నారు. ఇక గ‌త ఎన్నిక‌లలో గెలిచిన ఆయ‌న‌కు పీఏసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చినా కూడా నోట్లో బెల్లం ముక్క పెట్టుకున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు చుట్టు ముట్టాడుతున్నాయి. మ‌రి ప‌య్యావుల ఎప్పుడు యాక్టివ్ అవుతారో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: