బూతులకు యూనివర్సిటీ వైసీపీ పార్టీ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేసారు. పోలీస్ లను తిట్టిన నాయకులపై ఎలాంటి కేస్ లు పెట్టారు అని ఆయన ప్రశ్నించారు. పుంగనూరు, గిద్దలూరు లో దళిత బిడ్డలు నిలదీస్తే వారి ప్రాణాలు తీశారు అని ఆయన ఆరోపించారు. పి పి కిట్ లను అడిగితే వీరి వేధింపులకు డాక్టర్ సుధాకర్ గుండెపోటు తో మరణించారుఅని అన్నారు ఆయన. డీజీపీ పి ఆర్ ఓ ని జాగ్రత్తగా పంపిన, రక్షణ గా నిలిచిన వారిపై కేస్ లు పెట్టారు అని మండిపడ్డారు. మీరు 70 లక్షల మంది నమ్ముకున్న దేవాలయం పై దాడి చేశారు మీరు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

మా ఓర్పు సహనాన్ని మీరు పరిక్షిస్తున్నారు అని లోకేష్ ఫైర్ అయ్యారు. పోలీస్ లకు చెపుతున్నాం అని మఫ్టీ లో  మీవాళ్ళు వచ్చి మా దేవాలయం పై దాడులు చేస్తే వదలం అని హెచ్చరించారు. డ్రగ్స్ పై పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారుఅని అన్నారు. మఫ్టీలో పోలీసులను పంపి దాడి చేయించే ప్రయత్నం చేశారు అని లోకేష్ విమర్శలు చేసారు. అందుకే మేం ఆ పోలీసును నిలదీశాం అని అన్నారు ఆయన. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఇదే అని లోకేష్ వ్యాఖ్యలు చేసారు. టీడీపీ కార్యాలయానికి వైసీపీ కార్యకర్తలు రావచ్చు కానీ.. టీడీపీ కార్యకర్తలు రాకూడదా..? అని నిలదీశారు.

గాయపడ్డ పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి రావాలనుకుంటే రానివ్వలేదు అని విమర్శించారు ఆయన. సైకో రెడ్డి ప్రెస్ మీట్ చూశాం.. ఏ ఒక్క రోజూ పౌరుషం గా మాట్లాడలేదని విచిత్రంగా మాట్లాడారు అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఏమైనా అంటే.. ఏపీకే బీపీ వస్తుంది అని లోకేష్ వ్యాఖ్యలు చేసారు. వైసీపీ కుక్కలు దాడులు చేస్తే కేసులు పెట్టడం లేదని అన్నారు. డ్రగ్స్ పై మేం పోరాడుతుంటే పక్క రాష్ట్రం సీఎం స్పందిస్తే.. ఏపీ సీఎం మాత్రం స్పందించడం లేదు అని విమర్శించారు. డీజీ పోస్టింగ్ కోసం చంద్రబాబుకు గతంలో సవాంగ్ ఫోన్లు చేయలేదా..?  నిలదీశారు. దాడులు చేసిన వారు.. తన కార్యాలయం ఎదురుగా వెళ్తోన్నా.. పట్టుకోలేకుంటే.. ఆ చొక్కా ఎందుకు..? అని ప్రశ్నించారు. డీజీపీ ఖాకీ చొక్కా విప్పి వైసీపీ చొక్కా వేసుకుంటే మంచిది అని వెతికితే డీజీ ఇంట్లోనే డ్రగ్స్ దొరుకుతుందేమోననే సందేహం వస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: