ఒక‌ప్పుడు చంద్ర‌బాబు ఇలా ఉండేవాడు. ఇప్పుడు జ‌గ‌న్ ఇలా ఉంటున్నాడు. చంద్ర‌బాబులా జ‌గ‌న్ ఉంటున్నాడు. జ‌గ‌న్ స్థానంలో చంద్ర‌బాబు ఉండి కన్నీరెడుతున్నాడు. కానీ ఎవ‌రి ఏడుపు వారిదే క‌నుక బీజేపీ పెద్ద‌గా ప‌ట్టించుకోదు. ప‌ట్టించుకున్నా ఏదో తూతూ మంత్రంగానే ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుంటుంది.


బీజేపీ రెండు వైపులా ఉంటుంది. బీజేపీకి రెండు పార్టీల అవ‌స‌రం ఉంది. అవ‌సరం అయినా కాక‌పోయినా మాట్లాడ‌డం అన్న‌ది అస్స‌లు పెట్టుకోదు. కేవ‌లం కొన్ని సంద‌ర్భాల్లో త‌ప్ప మిగ‌తా ఏ వేళలోనూ రాష్ట్రం కు చెందిన నాయ‌కుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌దు. పాపం చంద్ర‌బాబు కాల్ చేశాడే కానీ ఇది ఏ మాత్రం వ‌ర్కౌట్ కాని ప‌ని. ముఖ్యంగా జ‌గ‌న్ ను చేర‌దీసేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోయేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్న మోడీ ఎలా టీడీపీకి అనుకూలంగా మాట్లాడ‌తాడ‌ని?

రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌పై కేంద్రం మాట్లాడితే బాగుంటుంది అన్న వాద‌న ఒక‌టి తెర‌పైకి వ‌స్తోంది. ముఖ్యంగా టీడీపీ కార్యాల‌యాల‌పై కొంద‌రు జ‌గ‌న్ అభిమానులు చేసిన దాడులపై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని టీడీపీ ప‌ట్టుబ‌డుతోంది. అదేవిధంగా ఈ ఘ‌ట‌న‌కు బాధ్యుల‌యిన వారిని వెంట‌నే అరెస్టు చేసి న్యాయ స్థానం ఎదుట హాజరు ప‌ర‌చాల‌ని డిమాండ్ చేస్తోంది. వీటిపై కేంద్రం త‌గిన విధంగా ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని అనుకోవడం అత్యాశే అయినా త‌మ ప‌రిధిలో తాము చేయాల్సిన విన్న‌పం ఇదొక్క‌టే అన్న విశ్వాసంలో ఉన్నారు టీడీపీ  నాయ‌కులు.

కానీ కేంద్రం అటు టీడీపీకి కానీ ఇటు వైసీపీకి కానీ తానేం బంధువు కానన్న సంకేతాలు ఇస్తుంది. అవ‌స‌ర‌మైతే పొత్తులు త‌ప్ప రాష్ట్రం వ్య‌వ‌హారంలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై మాట్లాడితే ఏమొస్తుందోనన్న భ‌యంలో ఉంది. అంతేకాదు జ‌గ‌న్ పై ఎటువంటి కామెంట్లు చేయ‌కూడద‌ని రాష్ట్ర బీజేపీ ఎప్పుడో నిర్ణ‌యించుకుంది. సోము వీర్రాజు ఎప్పుడూ కూడా జ‌గన్ ను ఒక్క మాటంటే ఒక్క మాట కూడా అన‌రు. ఇలాంటి త‌రుణంలో కేంద్రం నుంచి టీడీపీకి మ‌ద్ద‌తు ద‌క్క‌దు గాక ద‌క్క‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp