ఏదేమైనా ఈ సారి గుంటూరు జిల్లాలో వైసీపీకి చుక్కలు కనిపించేలా ఉన్నాయి. ఇప్పుడు ఏదో అధికారంలో ఉంది కాబట్టి, స్థానిక ఎన్నికల్లో ప్రజలు పూర్తిగా వైసీపీ వైపే నిలబడ్డారు...మళ్ళీ వైసీపీని కాదని వేరే వాళ్ళని గెలిపించిన ప్రయోజనం ఉండదు...పథకాలు అందవు అందుకే...గుంటూరు ప్రజలు సైతం వైసీపీ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పరిస్తితి ఉండదని అర్ధమవుతుంది. పూర్తిగా ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలకు చుక్కలు కనిపించేలా ఉన్నాయి.

ఇప్పటికే అనేక రకాలుగా ఎమ్మెల్యేలపై నెగిటివ్ వస్తుంది...పథకాల పేరిట రూపాయి వచ్చి...పన్నుల పేరిట ప్రభుత్వం పది రూపాయిలు లాగేస్తుంది...ఆ భారం ప్రజలపై స్పష్టంగా ఉంది. ఇదేగాక గుంటూరులో రాజధాని అంశం కీలక పాత్ర పోషించనుంది. జగన్ మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చి అమరావతిని శాసనరాజధానిగా చేస్తానని చెప్పారు. ఇక అక్కడ నుంచి అమరావతి రైతులు, ప్రజలు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతానికి ఉద్యమం అమరావతి ప్రాంతం వరకే ఉన్నట్లు కనిపిస్తోంది గానీ, ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా అంతటా ఉంటుందని తెలుస్తోందని చెప్పొచ్చు.

దీనికి తోడు కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు కూడా అంతగా బాగోవడం లేదు...అలాగే కొందరు అక్రమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక, ఇళ్ల స్థలాలు, అక్రమ మైనింగ్, సున్నపురాయి, బ్లీచింగ్ పౌడర్, కబ్జాలు ఇలాంటివి ఎక్కువైపోయాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్యేలకు బాగా మైనస్ అయ్యేలా ఉంది.


అయితే అన్నీ రకాలుగా మైనస్‌లు ఎక్కువ ఉన్న ఎమ్మెల్యేలు ఈ సారి గెలవడం కష్టమే అని తెలుస్తోంది. అలా మైనస్‌లు ఉన్నవారిలో తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, వినుకొండ, సత్తెనపల్లి, వేమూరు ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో నెక్స్ట్ వైసీపీ గెలుపు అంత సులువైతే కాదనే చెప్పొచ్చు. ఇక వైసీపీ బలంగా ఉన్నవాటిలో మాచర్ల, నరసారావుపేట, పెదకూరపాడు నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తానికైతే గుంటూరులో ఈ సారి వైసీపీకి చుక్కలే అని అర్ధమవుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: