తెలుగు దేశం పార్టీ(టీడీపీ) మరోసారి తెలుగు రాష్ట్రాలలో ప్రముఖంగా మీడియా దృష్టిని తమవైపుకు తిప్పుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కేవలం ఎవరైనా జాతీయ మంత్రి రాష్ట్రానికి వస్తున్నారంటే చాలు, బాబోరికి ఏపీ గుర్తుకువస్తుంది, అక్కడి ప్రజలు గుర్తును వస్తారు, వాళ్ళు కష్టాలు పడుతున్నట్టు గుర్తుకు వస్తుంది. అంతే తప్ప తానుగా ఏదైనా సేవ చేసి ప్రజల మనసులలో నిలబడాలనే ఆలోచన ఆ రక్తంలోనే లేనట్టుగానే ఉంది. ఎప్పుడు అధికారం కోసం దిగజారుడు రాజకీయాలు తప్ప, మరొకటి చేయలేని వారిలో ప్రముఖంగా ఆయనే ఉంటారేమో అంటున్నారు నిపుణులు. తాజాగా కూడా అదే తరహాలో తెలుగు రాష్ట్రాలకు జాతీయ మంత్రి వస్తున్నారనే వార్త తెలియగానే బాబోరు ఏపీకి పరుగులు పెట్టారు, ఆయన మంది మార్బలం కూడా అదే తరహాలో పరుగులు పెట్టారు.  

చివరికి వాళ్ళపై వాళ్లే దాడులు చేయించుకుని అది ప్రభుత్వమే చేయించిందని వారిపై అపవాదు తేవాలని అదికూడా కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని బాబొరి తిక్కల ప్రయత్నం. ఇన్ని చేస్తున్నా అక్కడి పోలీసులు వ్యక్తి కి పూర్వం ఉన్న అధికారానికి గౌరవం ఇచ్చి దానికి తగ్గట్టుగా హుందాగా ఉండాలని చెప్పడం కూడా తప్పే అంటాడు ఆయన. ఇది ఆయన ఇన్నేళ్లు రాజకీయ అనుభవాలు నేర్పిన పాఠాలు. వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరుగా బ్రాండ్ గా ఉన్న ఆయన నుండి ఇంతకంటే మంచిని ఆశించడం కూడా తప్పే. ఈ తెలివితేటలు అధికారంలో ఉన్న ఒక్కనాడు ప్రజల సేవ చేయడానికి ఉపయోగిస్తే ఇలాంటి పనికిమాలిన పనులు చేసుకుంటూ బ్రతకాల్సిన పని లేదని రాజకీయ ప్రముఖులు అంటున్నారు.  

ఇలాంటివి గతంలో చేసినా ప్రయోజనం లేకపోయిందని తెలిసి, మళ్ళీ అలాంటి వ్యూహాలే పన్నుతుంటే టీడీపీ రాజకీయాలు ఎంత దిగజారిపోయాయో చెప్పకనే తెలిసిపోతుంది. అయినా ఎవరో ఎందుకు సొంతపార్టీ వాళ్లే ఆయనకు దూరంగా ఉంటున్నారు అంటేనే ఆయన ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో అర్ధం అవుతుంది. అయినా ప్రభుత్వం చేస్తున్న పధకాలు కేసులు వేసి ఆపించడం కంటే నీచత్వం ఏమైనా ఉంటుందా, అలాంటి వాటికీ కూడా పాల్పడ్డాడు అంటేనే టీడీపీ ఆయన చేతిలో ఈసారి చచ్చిపోతుందని ఖాయం అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: