ఇలాంటివి చేయడం ద్వారా ప్రభుత్వం పై లేనిపోని ఒత్తిడి తప్ప మరో ప్రయోజనం ఉండబోదు. అసలే కరోనా, ఇతర సమస్యలతో ఎవరికి వారు సమతమైపోతున్నప్పుడు, అలాగే మరోపక్క ఉపఎన్నిక పనులలో అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి స్టంట్ లు చేసి టీడీపీ వారందరి పనిని అనవసరంగా చెడగొడుతుంది తప్ప మరొక్కటి లేదు. ఇలా అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు, మరోవైపు ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే పనికిమాలిన రాజకీయాలు టీడీపీ చరిత్రలో మాత్రమే చూడగలం. ఇంత దిగజారిపోయినా పరవాలేదు, ప్రజలలో జగన్ కు ఇసుమంత వ్యతిరేకత వస్తే చాలు అనేంత కింది స్థాయి ఆలోచనలు చేసే స్థాయిలో బాబోరు ఉండిపోయారు అంటే ఇంకా చెప్పడానికి ఏమి మిగుతుంది.
కొందరికి చెప్పినా వినరు, వాళ్ళ పంధానే అలా ఉంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం టీడీపీ అధినేత. ఒక్క సరైన ప్రభుత్వాన్ని తనపని తాను చేసుకోనివ్వకుండా ప్రతిదానికి అడ్డుపడుతూ, ప్రజల నోటికాడి కూడును కూడా లాగేసుకుంటున్న నేతగా ఆయన మిగిలిపోవా తప్ప మరొకటి ఇక్కడ ఏమి మిగలదు. ఇప్పటికే ఆయనను పక్కన పెట్టాలని అనుకుంటున్నప్పటికీ, ఈసారి ఎన్నికల వరకు కూడా కనీసం ఆయనను భరించక తప్పదని ఆ పార్టీ వారే అనుకుంటున్నప్పుడే ఆయన పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది.