తెలుగు తమ్ముళ్లలో అయోమయం
 
చంద్రబాబు నాయుడు నిరసన దీక్షకు కూర్చోవడంతో తెలుగు దేశం శ్రేణుల్లో కొంత అయోమయం నెలకొంది. అమరావతికి వెళ్లి సంఘీభావం తెలపాలా ? స్థానికంగానే నిరసన కార్యక్రమాలు చేయాలా ? అన్న సందిగ్దావస్థలో టిడిపి శ్రేణులున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యలయాలను ధ్వసం చేసిన తరువాత పరిణామాలను టి.డి.పి శ్రేణులు గమనిస్తున్నాయి. ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

గత కొంత కాలంగా అధికార, ప్రతిపక్షపార్టీల మధ్య మాటల యుద్దం జరిగింది.  ఆ సమయంలో  క్రింది స్థాయి నేతలు పత్రికా విలేఖరుల సమావేశలకు పరిమితమై అధికార పక్షం పై విమర్శలు చేసేవారు. తరువాత స్వరం మారింది. చేష్టలూ మారాయి. దాడులు జరిగాయి. ఒకరి పై ఒకరు దాడులు చేసుకోవడం ఆరంభమైంది. ఈ క్రమంలో  పోలీసు కేసులు కూడా.
 పెద్ద స్థాయి నేతలు, కార్యకర్తలు ఎప్పటి కప్పుడు నిరసన తెలిపినా వారంతా సేఫ్ జోన్ లోనే ఉంటారు. పోలీసులు కూడా వారిని హౌస్ అరెస్టులతో సరిపుచ్చుతారు. దీంతో ఎటోచ్చీ  క్రింది స్థాయి కార్యకర్తల పైనే ఎక్కువ భారం పడుతోంది. పోలీసుల లాఠీ దెబ్బల మొదలు, పోలీసు కేసులన్నీ కూడా సామాన్య కార్యకర్తలపైనే నమోదవుతాయి.

తాజాగా చంద్ర బాబు నాయుడు  అమరావతిలో దీక్షకు కూర్చోవడంతో  స్థానిక కేడర్ కు ఎలాంచి అదేశాలు అందలేదు. అమరావతికి వెళ్లి అక్కడి కార్యక్రమంలో సంఘీభావం ప్రకటించాలా ?, స్థానికంగానే నిరసనలు తెలపాలా ? అన్న విషయంలో  టిడిపి శ్రేణుల్లో అయోమయం నెలకొని ఉంది. అదే సమయంలో అధికార పక్ష కార్యకర్తలు జనాగ్రహ దీక్షలు చేస్తున్నారు. పోటీ పోటీగా దీక్షలు చేయాలంటే మితిమీరిన ఖర్చు తో కూడుకున్న పని కావడంతో తెలుగు దేశం శ్రేణులకు ఏం చేయాలో తోచటం లేదు. అంతే కాక జన సమీకరణ కూడా వ్యయ ప్రయాసలతో కూడినది కావడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది.
పార్టీ ఆఫీసులపై దాడులు జరిగినట్లు తమ నిరసన శిబిరాలపై కూడా దాడులు జరుగుతాయేమో అన్న భయం కూడా తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తోంది. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల తరువాత ఏవో కొద్ది నియోజక వర్గాలలో తప్ప నియోజరవర్గా స్థాయి నేతలు ఎవరూ కూడా క్రింది స్థాయి కార్యకర్తలకు అందుబాటులోలేరు. ఏదన్నా ఉపద్రవం వస్తే తమని ఎవరు ఆదుకుంటారు ? అని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: