తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని  ఇటీవ‌ల ప‌లు సర్వేలు చెపుతున్నాయి. తాజాగా ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్, సీ ఓటర్ సర్వే లోనూ దేశంలోనే ఎక్కువ ప్ర‌జాగ్ర‌హం ఉన్న సీఎంల‌లో కేసీఆర్ తొలి ప్లేసులో ఉన్నాడంటూ వెల్ల‌డైన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ ను రాష్ట్రంలో ఉన్న ప్ర‌జ‌ల్లో ఏకంగా 30.3 శాతం మంది కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారని  ఆ సర్వే తెలిపింది. అయితే కేసీఆర్ పాలనను ఆమోదించే వాళ్లు కూడా అంత కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని.. తాము 2023 ఎన్నిక‌ల్లోనూ బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించి హ్యాట్రిక్ కొడ‌తార‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ కు వ‌రుస‌గా రెండు సార్లు ఆయ‌నే ముఖ్య‌మంత్రి అయ్యారు. తొలి ఎన్నిక‌ల్లో ఓ మోస్త‌రు మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల లో ఏకంగా 88 సీట్ల‌తో తిరుగులేని మెజార్టీతో వ‌రుస‌గా రెండో సీఎం అయ్యారు. రెండో సారి సీఎం అయ్యాక ఆయ‌న మ‌రింత‌గా బ‌ల‌ప‌డ్డారు అన్న‌ది మాత్రం నిజం. ఇక 2023 సాధార‌ణ ఎన్నిక‌ల లో మూడోసారి మరింత మెజారిట వస్తుందని ఆ పార్టీ నేత‌లు ఘంటాప‌థంగా చెపుతున్నారు.

ఇక కులాల వారీగా ఓటు బ్యాంకును టీఆర్ ఎస్ ను ప‌దిల ప‌రుచు కుంటూ వ‌స్తోంది. ద‌ళిత బంధు ప‌థ‌కం దేశంలోనే పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌థ‌కంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళితులు అంద‌రూ గులాబీ పార్టీకి వ‌న్ సైడ్ గా ఓట్లేస్తార‌ని లెక్క‌లు వేస్తున్నారు. కొత్త జిల్లా ల ద్వారా పాల‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ అయ్యింది. ఇక ఎంతో కొంత ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్నా దానిని కాంగ్రెస్‌, టీఆర్ ఎస్ రెండు చీల్చుకోనున్నాయి . అదే జ‌రిగితే కేసీఆర్ కు మూడో సారి కూడా గెలుపు ప‌క్కాయే అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: