యుద్ధం ఎలా ఉన్నా విద్య‌లు మాత్రం తెలిసి ఉండాలి. దేహం ఎలా ఉన్నా ఆత్మ ర‌క్ష‌ణ విద్య‌లు త‌ప్పక తెలుసుకోవాలి. ఇప్పుడు ఆర్జీవీ కూడా త‌న‌దైన పంథాలో తెలుగు నేల‌పై నెల‌కొన్న వివాదాల‌పై స్పందించాడు. నాయ‌కుల‌కు ఓ ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఎప్పటి కప్పుడు వ‌ర్త‌మాన ప‌రిణామాల‌పై త‌రుచూ స్పందించే ఆర్జీవీ ఈ సారి కూడా త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేశాడు. ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కు లకు ఆత్మ ర‌క్ష‌ణ విద్య‌లు నేర్పాల్సి ఉంద‌న్న వాదం ఒక‌టి వినిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. రాజ‌కీయంలో ఎవ‌రు ఎలా ఉ న్నా త‌రువాత క‌లిసి కొట్టుకునేది విడిపోయి క‌ల‌హించుకునేది నాయ‌కులే క‌నుక సామాజిక మాధ్య‌మాల్లో వ‌ర్మ చేసిన పోస్టు పై భిన్న స్పంద‌న‌లు వ‌స్తున్నాయి.


రాజ‌కీయాలు అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడూ ఒకేలా ఉంటే అవి రాజ‌కీయాలు అని వ‌ర్ణించ‌లేం. అవే రాజకీయాలు అని నిర్థారించలేం కూడా! రంగు రంగుల రాజ‌కీయంలో టీడీపీ, వైసీపీ మాత్ర‌మే కొట్టుకుంటున్నాయి. అప్పుడ‌ప్పుడూ బ‌య‌ట‌కు వ‌చ్చే కొన్ని రాజ‌కీయ శ‌క్తులు కూడా వీటికి వంత పాడుతున్నాయి. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఏమ‌యినా త‌ప్పు చేశాడా? ఫ్రెండ్ కొడుకుని సీఎంను చేసి ఏమ‌యినా త‌ప్పు చేశాడా? అవును! బాబు అనుకున్న విధంగా రాజ‌కీయం లేదు. రాజకీయ సంబంధ వ‌ర్గాలు ఎంచుకున్న విధంగా చంద్ర‌బాబు న‌డ‌క లేదు. క‌నుక ఆయ‌న‌కు పెద్ద‌గా ఎవ్వ‌రూ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు.


ఇదే సంద‌ర్భంలో పిల్లాడ‌యిన జ‌గ‌న్ దూసుకుపోతున్నాడు. అనుకున్న‌వ‌న్నీ సాధిస్తున్నాడు. అనుకోనివి కూడా సాధిస్తున్నా డు. ఇదే చంద్ర‌బాబు కు క‌ష్టంగా ఉంది. రేప‌టి వేళ సంక్షేమ సూత్రాలు వ‌ర్కౌట్ కాక‌పోతే ఆయ‌నే సీఎం. అందుక‌నో ఇప్ప‌టి నుంచి దీక్ష‌ల‌కు సిద్ధం అవుతు న్నాడు బాబు. ఇలా చేయ‌డంతో మంచి పేరు తెచ్చుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు ఆలోచన‌. కానీ ఇప్పుడు ప్ర‌జ‌లు వేర్వేరు ఇబ్బం దుల్లో ఉన్న కార‌ణంగా చంద్ర‌బాబును ప‌ట్టించుకుంటారో లేదో కానీ ఆయ‌న చెప్పే విమ‌ర్శ‌ల్లో నిజాలు అన్న‌ది వెతికి తీస్తారు. ఈ నే ప‌థ్యంలో ఆర్జీవీ సోష‌ల్ మీడియాలో స్పందించాడు. ఆంధ్రావ‌ని ప‌రిణామాల‌పై స్పందించి మ‌న నాయ‌కులు బాక్సింగ్, కరాటే, క‌ర్ర సా ము త‌దిత‌ర ఆత్మ ర‌క్ష‌ణ విద్య‌లు నేర్చుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌ముంద‌ని పెద‌వి విరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rgv