ట్రంప్.. నెక్ట్స్ స్టెప్ ఏంటి ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనా ల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు ? పదవి నుంచి దిగిపోయిన నేతలంతా ఏం చేస్తుంటారో  అదే చేస్తున్నారు అని అనుకుంటున్నారా ? అదే తప్పు. ఎప్పుడూ కుదురుగా కూర్చోని ట్రంప్  కొత్త వ్యాపారంలోకి వస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సొంత సంస్థ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ (టి.ఎం,టి.జి) స్వయంగా ప్రకటించింది. ఇంటర్నెట్ రంగంలో ట్రంప్  తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారని కూడా టి.ఎం.టి.జి ప్రకటించింది.
నిరంతరం వార్తల్లో ఉండాలని భావించే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్య మాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. సమాజిక మాధ్యమాల్లో 'నిరంకుశ ' పోకడలకు వ్యతిరేకంగా తాను ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.  ట్రంప్ ఈ రంగంలోకి ప్రవేశించడానికి  ఓ ప్రత్యేక కారణం ఉంది.  దాదాపు తొమ్మిది నెలల క్రితం ట్రంప్ సోషల్ మీడియా ఖాతా ఫేస్ బుక్ ను  ఆ సంస్థ బ్యాన్ చేసింది. దీంతో ఆయన కోర్టుకు ఎక్కారు. అక్కడ ఏ విషయం తేలలేదు. దీంతో ఆయన సొంతంగా "టి.ఆర్.యు.టి.హెచ్  (ట్రూత్)"  పేరుతో సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. సిలికాన్ వ్యాలీలో ఇది సంచలనం సృష్టిస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాలు తాలిబన్ ల ఆధిపత్యం కొనసాగుతోందని పేర్కోంటూ, ప్రస్తుత అధ్యక్షుడు సైలెంట్ గా ఉన్నారంటూ  ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ఆరంభంలో కానీ ట్రూత్ పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తుందని ప్రకటించారు. నిష్పక్షపాతంగా సమాచారం అందిస్తుందని కూడా ట్రంప్ ప్రకటించారు. చాలా మంది గొంతుకలు ప్రస్తుతం ఉన్న సమాజిక మాధ్యమాలలో మూగపోతున్నాయని, ఇకపై అలా ఉండదని అమెరికా మాజీ అధ్యక్షుడు ప్రకటించారు. ఇటీవలి అమెరికా ఎన్నికల్లో  రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు  పెద్ద సంఖ్యలో గెలవ లేక పోవడానికి ఫేస్ బుక్ కారణమని గతంలో ట్రంప్ చాలా సార్లు ఆరోపించారు.  ఆ  ఎన్నికల్లో డెమెక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొంది అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన విషయం అందరికీ తెలిసిందే.
అంతర్జాతీయ పత్రికలు మాత్రం ట్రంప్ తాజా వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాయి.  సామాజిక మాధ్యమాల్లోకి ట్రంప్ రావడం ఇదే తొలిసారి కాదని తెలిపాయి.  ఈ ఏడాది మే నెలలో ట్రంప్ ఫ్రం ది డెస్క్ ఆఫ్ డోనాల్డ్ ట్రంప్ పేరుతో ఒక బ్లాగ్ నూ రూపొందించారు. కొంత కాలానికి అది మూత పడింది. ఆ తరువాత కొద్ది నెలలకు 'గిట్టర్ ' పేరుతో మరో ప్రాజెక్టును  జాన్సన్ మిల్లర్ ఆరంభించారు. మిల్లర్ ఈ అమెరికా మాజీ అధ్యక్షుడికి సహచరుడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇది కూడా మూత పడింది. ట్రంప్ తాజాగా ట్రూత్ పేరుతో మరలా ప్రజల ముందుకు వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: