హుజురాబాద్ ఉప ఎన్నిక ద‌గ్గ‌ర పడుతుంద‌డ‌డంతో ప్ర‌చారం మ‌రింత జోరందుకుంది. ఆయా పార్టీల అభ్య‌ర్థులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌చారంలో మునిగిపోయారు. ఎలాగైన గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఆయా పార్టీలో ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌చారంలో పాల్గొన్న ఈట‌ల రాజేంద‌ర్ కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. మాట తప్ప‌ను అన్నాడు....అవసరమైతే తల న‌రుక్కుంటా అన్న సీఎం కేసీఆర్‌.. దళితులను మోసం చేస్తూనే ఉంటాడు అని ఈట‌ల రాజేంద‌ర్ మండిప‌డ్డారు.
 

హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని క‌మ‌లాపూర్ మండలం మర్రిపల్లిలో ఈటల రాజేందర్ ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. ద‌ళిత బంధును ఎవరో అపుతున్నార‌న్న‌ట్టు దుష్ ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. దళితులకు సబ్సీడీ రుణాలు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశాడు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఈట‌ల‌... డబుల్ బెడ్ రూంలు ఇవ్వలేదు అని గుర్తు చేశారు.


దళితబంధుతో మోసం చేస్తున్నాడు అని ఎవరూ అనట్లే అహో.. ఓహో అంటున్నారు అని అన్నారు. దళితులకు తప్పకుండా `దళితబంధు` ఇవ్వాలని డిమాండ్ చేసిన... ఇప్ప‌టికీ డిమాండ్ చేస్తున్నా అంటూ స్ప‌ష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ దెబ్బకే ఫించన్లు, రేషన్ కార్డులు, ఇళ్ళ స్థలాలు ఉన్నవాళ్ళకీ ఇండ్లు కట్టుకునే జీవో వస్తున్నాయి అని చెప్పారు. ఎన్నికలు ఉంటేనే హమీలు, చెక్కులు ఇస్తాడు...ఇది కేసీఆర్ నైజం తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

ఈటలను ఓడగొట్టలనే ఇన్ని హమీలు, ఇన్ని నిధులు ఇచ్చాడు... కానీ, ప్రజల మీద ప్రేమ మీద కాదు అని తెలిపారు. కేసీఆర్ కీ ఎప్పటికీ నేను నా కొడుకు రాజ్యం....పాలన ఉండాలనే తపన ప‌డుతార‌ని ఆరోపించారు. ఇక్కడ ప్రజాప్రతినిధులకు బిల్లులు, డబ్బులు ఈటల వలనే వస్తున్నాయి అని స్ప‌ష్టం చేశారు. 30 వ తేది తరువాత వీళ్ళ అందరీ బతుకు బజారుపాలేన‌ని.. వీళ్ల‌ను ఎవరు పట్టించుకోరు అని తేల్చి చెప్పారు. అక్టోబ‌ర్ 30 వ తేదిన జ‌రిగే హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: